Game Changer | కొత్త ఏడాదిలో కూడా కొనసాగనున్న షూటింగ్
Game Changer - ఇప్పటికే గేమ్ ఛేంజర్ సినిమా స్టార్ట్ అయి ఏడాది దాటింది. ఇప్పుడు కొత్త ఏడాదిలో కూడా ఈ సినిమా షూటింగ్ నడవబోతోంది.

“గేమ్ ఛేంజర్” చిత్రీకరణ చాలా నెలలుగా కొనసాగుతోంది. దర్శకుడు శంకర్ దీనిని 2023 సంవత్సరం పొడవునా వివిధ ప్రదేశాలలో చిత్రీకరించారు. డిసెంబర్‌లో కూడా అతను ఓ 2 సీక్వెన్సులు చిత్రీకరించాడు. అయితే షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు.
మరి గేమ్ ఛేంజర్ సినిమా నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది? తాజా సమాచారం ప్రకారం.. జనవరి చివరి నాటికి ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చు. ఈ మేరకు చరణ్, దిల్ రాజుకు శంకర్ సమాచారం అందించినట్టు తెలుస్తోంది. జనవరి నెల మొత్తం గేమ్ ఛేంజర్ సినిమాకే టైమ్ కేటాయిస్తానని హామీ ఇచ్చాడట.
ఒక్క పాట, కొంత బ్యాలెన్స్ వర్క్ మినహా అన్నీ అనుకున్నట్లు జరిగితే జనవరిలో షూటింగ్ పూర్తి అయ్యే అవకాశం ఉంది. "గేమ్ ఛేంజర్" అనేది భారతదేశ ఎన్నికల వ్యవస్థకు సంబంధించిన పొలిటికల్ డ్రామా. కార్తీక్ సుబ్బరాజ్ రాసిన కథకు, శంకర్ తనదైన టేకింగ్ జోడిస్తూ సినిమా తీస్తున్నారు.
కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, అంజలి కీలక పాత్రలో నటిస్తోంది. “గేమ్ ఛేంజర్” చిత్రాన్ని 2024 సెప్టెంబర్ లో దసరా కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.