Telugu Global
Cinema & Entertainment

గేమ్ ఛేంజర్ మూవీకి టికెట్ రేట్లు పెంపు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీకి టికెట్ రేట్లు పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

గేమ్ ఛేంజర్ మూవీకి టికెట్ రేట్లు పెంపు
X

మెగా హీరో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీకి టికెట్ రేట్లు పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 10న ఈ సినిమా ఫ్యాన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో ఏపీ సర్కార్ టికెట్ ధరల పెంపుతో పాటు, బెనిఫిట్ షోలకూ అనుమతి ఇచ్చింది. అర్ధరాత్రి 1 గంట ప్రీమియర్ షోకు టికెట్ రేటుపై అదనంగా రూ.600 పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షో కాకుండా మిగతా రోజుల్లో ఈ టికెట్ రేట్లు వర్తిస్తాయి. గేమ్ ఛేంజర్ చిత్రాన్ని ప్రదర్శించే మల్టిప్లెక్స్ లలో టికెట్ పై అదనంగా రూ.175 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

అలాగే సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ పై అదనంగా రూ.135 పెంచుకునేందుకు సర్కార్ పర్మిషన్ ఇచ్చింది. అలాగే బెనిఫిట్ షోతో పాటు మిగతా రోజుల్లో టికెట్లకు కూడా జీఎస్టీతో కలిపి ఈ రేట్లను వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు కానీ, టికెట్ల రేట్ల పెంపుకు కానీ అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పేయడంతో డల్ గా ఉన్న టాలీవుడ్ కు ఏపీ ప్రభుత్వ నిర్ణయం ఊరటనివ్వబోతోంది. తాజాగా తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఈ సంక్రాంతికి వస్తున్న గేమ్ ఛేంజర్ తో పాటు సంక్రాంతికి వస్తున్నా చిత్రాలను ఆయనే నిర్మించారు. ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్ చిత్రం అయిన గేమ్ ఛేంజర్ కు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి కోరడంతో ప్రభుత్వం అంగీకరించింది.

First Published:  4 Jan 2025 7:05 PM IST
Next Story