Telugu Global
Cinema & Entertainment

టీవీల్లో 'గేమ్ ఛేంజ‌ర్‌ మూవీ..నిర్మాత ఆవేదన

'గేమ్ ఛేంజ‌ర్' సినిమా ఏపీలోని కేబుల్ టీవీలో ప్ర‌సారం అవుతున్న‌ట్లు తెలుస్తోంది.

టీవీల్లో గేమ్ ఛేంజ‌ర్‌ మూవీ..నిర్మాత ఆవేదన
X

మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన 'గేమ్ ఛేంజ‌ర్' సినిమా ఏపీలోని కేబుల్ టీవీలో ప్ర‌సారం అవుతున్న‌ట్లు తెలుస్తోంది. దీని టీవీ నిర్మాత స్పందిస్తూ ఛాన‌ల్లో పైర‌సీ హెచ్‌డీ ప్రింట్‌ను ప్ర‌సారం చేస్తున్నార‌ని దీనిపై నిర్మాత శ్రీనివాస్ కుమార్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమా అంటే కేవలం హీరో, దర్శకుడు, నిర్మాతలే కాదు ఇది 3-4 సంవత్సరాల కృషి, అంకితభావం వేలది మంది కలల ఫలితం.

ఇవి సినీ పరిశ్రమ భవిష్యత్తుకు ముప్పు ప్రభుత్వాలు దీనికి ముగింపు పలికేలా కఠిన చర్యలు తీసుకోవాలి సినిమాను బతికించేందుకునేందుకు ఏకమవుదాం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తు ట్వీట్ చేశారు.అలాంటిది ఇలా సింపుల్‌గా చిత్రాన్ని బ‌య‌ట‌పెట్ట‌డం ఏంట‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సినిమా వెనక కొన్ని వేల మంది శ్ర‌మ దాగి ఉంటుంద‌ని తెలిపారు. కాగా, ఈ సినిమా విడుద‌ల‌కు ముందే కుట్ర‌లు జ‌రిగాయ‌ని చిత్ర బృందం పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే.

First Published:  15 Jan 2025 12:38 PM IST
Next Story