35 Movie | ఫ్రెండ్ షిప్ సాంగ్ రిలీజ్
35 Movie - "35- చిన్న కథ కాదు" అనే సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ఈ మూవీ నుంచి ఫ్రెండ్ షిప్ సాంగ్ రిలీజ్ చేశారు.
నివేత థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్ "35-చిన్న కథ కాదు". సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా మేకర్స్ ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఫస్ట్ సింగిల్ సయ్యారే సయ్యా పాటని రిలీజ్ చేశారు. ఫ్రెండ్ షిప్ ని సెలబ్రేట్ చేసుకునే ఈ పాటని వివేక్ సాగర్ చాలా లైవ్లీగా కంపోజ్ చేశాడు. వినగానే మనసుని హత్తుకునేలా ఉంది ఈ ట్యూన్.
కిట్టు విస్సాప్రగడ రాసిన లిరిక్స్ చిన్ననాటి జ్ఞాపకాలను, స్నేహాలని గుర్తుకు తెస్తోంది. సింగర్ కార్తీక్ ఈ సాంగ్ జాయ్ ఫుల్ గా పాడాడు. స్కూల్ ఎపిసోడ్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా క్లీన్ ఎంటర్ టైన్ మెంట్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు ఈ సినిమా రెడీ అవుతోంది.
“35-చిన్న కథ కాదు” ఆగస్టు 15న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.