Telugu Global
Cinema & Entertainment

Guntur Kaaram | మహేష్ మూవీకి మొదటి రోజే కీలకం

Guntur Kaaram - మహేష్ హీరోగా నటిస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమాకు విడుదలైన మొదటి రోజు అత్యంత కీలకం. ఎందుకో చూద్దాం.

Guntur Kaaram | మహేష్ మూవీకి మొదటి రోజే కీలకం
X

గుంటూరు కారం" నిర్మాతలు విడుదలైన మొదటి రోజు వసూళ్లను పెంచే ప్రయత్నాల్లో ఉన్నారు. వారు ఏ అవకాశాన్ని వృథా చేయడం లేదు. తాజా సమాచారం ప్రకారం, హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గుంటూరు కారం సినిమాకు ఎర్లీ మార్నింగ్ షోలు పడబోతున్నాయి.


రీసెంట్ గా వచ్చిన సలార్ కు మిడ్ నైట్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలు పడ్డాయి. కాకపోతే అవి పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి. గుంటూరుకారంకు మాత్రం ఎర్లీ మార్నింగ్ షోలకు భారీగా స్క్రీన్లు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదయం 4 గంటల ఆట, ఆ తర్వాత ఉదయం 7 గంటల ఆటకు హైదరాబాద్ లోని దాదాపు అన్ని మల్టీప్లెక్సుల్ని కేటాయించాలని అనుకుంటున్నారట.


మొదటి రోజు భారీ ఓపెనింగ్ రికార్డ్ రావాలంటే, బెనిఫిట్ షోలతో పాటు, ఎర్లీ మార్నింగ్ షోలు పడాల్సిందే. అందుకే హారిక-హాసిని నిర్మాతలు ఈ అంశంపై భారీగా దృష్టిపెట్టారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సలార్ సినిమాకు తెలంగాణ అంతటా 20 బెనిఫిట్ షోలకు అనుమతినిచ్చింది ప్రభుత్వం.


గుంటూరుకారం సినిమాకు కనీసం 100 షోలకు అనుమతులు తెచ్చుకోవాలని చూస్తున్నారు. అదే కనుక జరిగితే మహేష్ సినిమాకు రికార్డ్ ఓపెనింగ్స్ గ్యారెంటీ. సంక్రాంతి బరిలో ఈ సినిమాకు తీవ్రమైన పోటీ ఉంది. అందుకే 11వ తేదీ అర్థరాత్రి నుంచే షోలు మొదలుపెట్టి, 12వ తేదీకి గ్రాండ్ గా సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. అదే రోజు హను-మాన్ సినిమా రిలీజ్ ఉంది. ఆ తర్వాత రోజు సైంధవ్, ఈగల్ సినిమాలొస్తున్నాయి.


కాబట్టి గుంటూరుకారం సినిమాకు ఉన్న ఏకైక అవకాశం, 11 అర్థరాత్రితో పాటు, 12వ తేదీ మాత్రమే. అందుకే ఆ రెండు రోజుల వసూళ్లపై గట్టిగా దృష్టిపెట్టారు.

First Published:  3 Jan 2024 9:01 PM IST
Next Story