Telugu Global
Cinema & Entertainment

‘యానిమల్’ రణబీర్ కపూర్ ఫిలిం ఫేర్ విజేత!

ఈ వేడుకలో ప్రముఖ బాలీవుడ్ జంట ఆలియా భట్, రణబీర్ కపూర్‌లు ఉత్తమ నటుడు, నటి అవార్డుల్ని గెలుచుకున్నారు.

‘యానిమల్’ రణబీర్ కపూర్ ఫిలిం ఫేర్ విజేత!
X

గుజరాత్ టూరిజంతో 69వ హ్యుందాయ్ ఫిలింఫేర్ అవార్డ్స్ 2024 గుజరాత్‌లోని నిన్న రాత్రి గిఫ్ట్ సిటీలో జరిగింది. బాలీవుడ్ సెలబ్రిటీలు కరణ్ జోహార్, ఆయుష్మాన్ ఖురానా, మనీష్ పాల్ లు హోస్ట్ చేసిన ఈ తారాతోరణం వెల్లివిరిసిన మిరుమిట్లుగొలిపే రాత్రి- ఉత్కంఠరేపే వినోద ప్రదర్శనల మధ్య పరమాద్భుతంగా జరిగింది. బాలీవుడ్ లోని అత్యుత్తమ ప్రతిభావంతులు భారతీయ సినిమా రంగంలో విశ్వసనీయతకి, విజయానికీ ప్రతిరూపమైన బ్లాక్ లేడీ (ఫిలింఫేర్ ప్రతిమ) ని సొంతం చేసుకున్నారు.

ఈ వేడుకలో ప్రముఖ బాలీవుడ్ జంట ఆలియా భట్, రణబీర్ కపూర్‌లు ఉత్తమ నటుడు, నటి అవార్డుల్ని గెలుచుకున్నారు. ఆలియా భట్ ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ లో తన పాత్రకు ఉత్తమ నటి అవార్డు అందుకోగా , ఆమె భర్త రణబీర్ కపూర్ ‘యానిమల్‌’ లో అద్భుతమైన నటనకి ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో’ యానిమల్’ మొత్తం 6 ట్రోఫీలతో పోటీలో ముందుండగా, విధూ వినోద్ చోప్రా ‘12th ఫెయిల్’ కి ఉత్తమ చలనచిత్రంతో బాటు ఉత్తమ దర్శకుడు అవార్డుల్ని సొంతం చే సుకున్నారు. క్రిటిక్స్ విభాగంలో, విక్రాంత్ మాస్సే ‘12th ఫెయిల్’ కి ఉత్తమ నటుడి అవార్డుని గెలుచుకున్నాడు.

విజేతల పూర్తి జాబితా ఇక్కడ వుంది:

ఉత్తమ చలన చిత్రం : 12th ఫెయిల్, ఉత్తమ దర్శకుడు: విధూ వినోద్ చోప్రా (12th ఫెయిల్), ఉత్తమ చలన చిత్రం క్రిటిక్స్ అవార్డ్ : జోరం (దేవాశిష్ మఖిజా), ఉత్తమ నటుడు : రణబీర్ కపూర్ (యానిమల్), ఉత్తమ నటుడు క్రిటిక్స్ అవార్డ్ : విక్రాంత్ మాస్సే (12th ఫెయిల్), ఉత్తమ నటి : ఆలియా భట్ (రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ), ఉత్తమ నటి క్రిటిక్స్ అవార్డ్ : రాణీ ముఖర్జీ (మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే), షెఫాలీ షా (త్రీ ఆఫ్ అజ్), ఉత్తమ సహాయక నటుడు : విక్కీ కౌశల్ (డంకీ), ఉత్తమ సహాయ నటి : షబానా అజ్మీ (రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ)

ఉత్తమ గీత రచయిత : అమితాబ్ భట్టాచార్య (తేరే వాస్తే - జరా హాట్కే జరా బచ్కే), ఉత్తమ సంగీత ఆల్బమ్ : యానిమల్ (ప్రీతమ్, విశాల్ మిశ్రా, మానన్ భరద్వాజ్, శ్రేయస్ పురాణిక్, జానీ, భూపీందర్ బబ్బల్, ఆషిమ్ కెమ్సన్, హర్షవర్ధన్ రామేశ్వర్, గురిండర్ సీగల్), ఉత్తమ నేపథ్య గాయకుడు : భూపిందర్ బబ్బల్ (అర్జన్ వైల్లీ – యానిమల్), ఉత్తమ నేపథ్య గాయని : శిల్పా రావు (బేషరం రంగ్ - పఠాన్), ఉత్తమ కథ : అమిత్ రాయ్ (ఓఎంజీ 2), దేవాశిష్ మఖిజా (జోరం), ఉత్తమ స్క్రీన్ ప్లే : విధూ వినోద్ చోప్రా (12th ఫెయిల్), ఉత్తమ సంభాషణలు : ఇషితా మోయిత్రా (రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ), ఉత్తమ నేపథ్య సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్ (యానిమల్)

ఉత్తమ ఛాయాగ్రహణం : అవినాష్ అరుణ్ ధావరే (త్రీ ఆఫ్ అజ్), ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : సుబ్రతా చక్రవర్తి, అమిత్ రే (సామ్ బహదూర్), ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ : సచిన్ లవ్లేకర్, దివ్యా గంభీర్, నిధీ గంభీర్ (సామ్ బహదూర్), ఉత్తమ సౌండ్ డిజైన్ : కుణాల్ శర్మ : (సామ్ బహదూర్), సింక్ సినిమా (యానిమల్), ఉత్తమ కూర్పు : జస్కున్వర్ సింగ్ కోహ్లీ - విధూ వినోద్ చోప్రా (12th ఫెయిల్), ఉత్తమ యాక్షన్ : స్పిరో రజాటోస్, అరసు, క్రైగ్ మాక్రే, యాన్నిక్ బెన్, కెచా ఖమ్‌ఫక్డీ, సునీల్ రోడ్రిగ్స్ (జవాన్)

ఉత్తమ వీఎఫ్ఎక్స్: రెడ్ చిల్లీస్ వీఎఫ్ఎక్స్ (జవాన్), ఉత్తమ నృత్య దర్శకుడు : గణేష్ ఆచార్య (వాట్ ఝుమ్కా?- రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ), ఉత్తమ నూతన నటుడు : తరుణ్ దూదేజా (ధక్ ధక్), ఉత్తమ నూతన నటి : అలీజ్ అగ్నిహోత్రి (ఫర్రే), లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డు : డేవిడ్ ధావన్ (దర్శకుడు).

ఇలావుండగా షారుఖ్ ఖాన్స్ ఫ్యాన్స్ ఈ అవార్డులపై దుమారం రేపుతున్నారు. ఫిలింఫేర్ అవార్డ్స్ 2024లో ‘జవాన్’ స్టార్‌ షారుఖ్ ఖాన్ విశ్మరించడంతో సోషల్ మీడియాలో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023 లో మూడు సూపర్ హిట్స్ తో అద్భుత విజయాలు అందించినప్పటికీ అవార్డ్స్ లో అతడికి ఎటువంటి గుర్తింపు లభించకపోవడంపై అభిమానులు తమ నిరాశని వ్యక్తం చేస్తూ పోస్టులతో సోషల్ మీడియాని నింపడం ప్రారంభించారు. 2023 లో పఠాన్, జవాన్, డంకీ ఘనవిజయాలతో రికార్డు స్థాయిలో రూ. 2,660 కోట్లకు పైగా వసూళ్ళు సాధించిన తమ స్టార్ కి ఉత్తమ నటుడి అర్హత లేకుంటే, మరెవరూ దానికి అర్హులు కాదని విమర్శలు గుప్పించారు. ఇంకో అభిమాని ఫిలిం ఫేర్ ని ఫసీరియస్‌గా తీసుకోవద్దని, అలాంటి అవార్డుల కంటే ఎసార్కే ఎంతో ఎత్తులో వున్నాడని మర్చిపోవద్దనీ ట్వీట్ చేశాడు.

First Published:  29 Jan 2024 3:03 PM IST
Next Story