Telugu Global
Cinema & Entertainment

గోల్డ్‌ స్మగ్లింగ్ చేస్తూ ఎయిర్ పోర్టులో అడ్డంగా దొరికిన నటి

కన్నడ హీరోయిన్ రన్యారావును బెంగళూరు ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయింది.

గోల్డ్‌ స్మగ్లింగ్ చేస్తూ ఎయిర్ పోర్టులో అడ్డంగా దొరికిన నటి
X

కన్నడ ప్రముఖ హీరోయిన్ రన్యారావును నుండి కస్టమ్స్ అధికారులు 14.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నరు. బెంగళూరు ఎయిర్ పోర్టులో దుబాయ్ నుండి వచ్చిన కన్నడ సినీ నటి రన్యా రావు నుండి 14.8 కిలోల గోల్డ్‌ను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాన్యా ఇటీవల తరచూ దుబాయ్‌ వెళ్లి వస్తుండడంతో ఆమెపై నిఘా పెట్టారు. గత 15 రోజుల్లో 4 సార్లు దుబాయ్‌ వెళ్లొచ్చిన రాన్యా.. ఎలాంటి అనుమానం రాకుండా.. గోల్డ్‌ బిస్కెట్లను దుస్తుల్లో దాచి, తీసుకొచ్చేవారని డీఆర్‌ఐ అధికారులు తెలిపారు.

బంగారం స్మగ్లింగ్‌ కేసులో పట్టుబడిన కన్నడ నటి రన్యా రావును అరెస్ట్‌ చేసిన పోలీసులు ఆమెను విచారణ జరుపుతున్నారు. మార్చి 3న ఆమె దుబాయ్ నుంచి తీసుకువచ్చిన 14.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ గోల్డ్ విలువ రూ.12 కోట్లు ఉంటుందని తెలిపారు. రన్యా రావును డీఆర్ఐ అధికారులు ప్రశ్నిస్తుండగా.. తాను డీజీపీ కూతురిని అని ఆమె ప్రచారం చేసుకుంటున్నట్లు గుర్తించారు. గతంలో కూడా రన్యా రావు ఇలాగే అనేక సందర్భాల్లో ఈ రకమైన బంగారం అక్రమ రవాణాకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కన్నడలో కిచ్చ సుదీప్‌తో కలిసి రన్యా రావు.. మాణిక్య అనే సినిమాలో నటించింది.

First Published:  4 March 2025 8:53 PM IST
Next Story