బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌కు ఈడీ సమన్లు
కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ.. కోల్‌కతా, భోపాల్, ముంబై తదితర ప్రాంతాల్లో మనీ లాండరింగ్‌కు సంబంధించిన కేసులపై దర్యాప్తు చేస్తోంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాజాగా సమన్లు జారీ చేసింది. మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో ఈ నెల 10న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నది.
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ మహదేవ్‌కు సంబంధించి రణ్‌బీర్ కపూర్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఉన్నాడు. ఈ ప్లాట్‌ఫామ్ నుంచి రణ్‌బీర్ భారీ మొత్తంలో డబ్బు అందుకున్నట్లు ఈడీ గుర్తించింది. కాగా, మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ భారీగా హవాలా ఆపరేషన్స్ చేస్తున్నట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఈ విచారణలో భాగంగానే రణ్‌బీర్ కపూర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది.
కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ.. కోల్‌కతా, భోపాల్, ముంబై తదితర ప్రాంతాల్లో మనీ లాండరింగ్‌కు సంబంధించిన కేసులపై దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌తో వీటికి సంబంధం ఉన్నట్లు తేలింది. యూఏఈ కేంద్రంగా ఈ బెట్టింగ్ యాప్ తన కార్యకలాపాలు సాగిస్తోంది. అక్కడి నుంచి భారీగా హవాలా రూపంలో డబ్బును తరలిస్తున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ క్రమంలో ఈ యాప్‌ను ప్రమోట్ చేస్తున్న రణ్‌బీర్‌ను కూడా విచారణకు పిలిచింది.
బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు గాయకులు, కమెడియన్లు పలువురు ఇటీవల బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ బెట్టింగ్ యాప్ కో-ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ పెళ్లికి బాలీవుడ్ లోని ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో రణ్‌బీర్ కపూర్ కూడా ఉన్నారు. దీంతో బెట్టింగ్ యాప్‌తో ఇంకెవరెవరికి సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది.