Telugu Global
Cinema & Entertainment

Lucky Baskhar | లక్కీ భాస్కర్ కొత్త రిలీజ్ డేట్

Lucky Baskhar Release Date: దుల్కర్ సల్మాన్ తాజా చిత్రం లక్కీ భాస్కర్. ఈ సినిమాకు కొత్త విడుదల తేదీ లాక్ అయింది.

Lucky Baskhar | లక్కీ భాస్కర్ కొత్త రిలీజ్ డేట్
X

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో కూడా పాపులర్ అనే సంగతి తెలిసిందే. "మహానటి", "సీతారామం" విజయాలతో దుల్కర్ కు తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇప్పుడీ హీరో "లక్కీ భాస్కర్" అనే మరో వైవిధ్యమైన పీరియడ్ డ్రామా చిత్రం చేస్తున్నాడు.

1980-90 ల కాలంలో అసాధారణ స్థాయికి చేరుకున్న ఒక సాధారణ బ్యాంక్ క్యాషియర్ ప్రయాణాన్ని ''లక్కీ భాస్కర్'' చిత్రంలో చూడబోతున్నాం. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది.

ఈ సినిమాని సెప్టెంబర్ 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. నిజానికి ఈ సినిమాను సెప్టెంబర్ 27న విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ ఫస్ట్ కాపీ తొందరగానే రెడీ అవుతున్న నేపథ్యంలో, 3 వారాల ముందే థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.

"లక్కీ భాస్కర్" చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రం కోసం నిర్మాతలు 80ల నాటి ముంబై నగరాన్ని హైదరాబాద్‌లో భారీ సెట్‌ వేశారు. అలాగే ఆ కాలం నాటి బ్యాంకులను పోలి ఉండే భారీ బ్యాంక్ సెట్‌ను కూడా రూపొందించారు.

ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా.. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే టీజర్ తో పాటు ఓ సాంగ్ రిలీజైన సంగతి తెలిసిందే.

First Published:  9 July 2024 8:15 AM GMT
Next Story