Dulquer Salmaan | చేదు అనుభవాలు ఎదురయ్యాయంటున్న దుల్కర్
Dulquer - కేవలం నటుడిగానే చాలామందికి తెలుసు దుల్కర్. కానీ ఈ నటుడు, ఓ నిర్మాత కూడా. కొన్ని చేదు అనుభవాలు కూడా ఉన్నాయి.
దుల్కర్ చాలామందికి హీరోగానే తెలుసు. కానీ అతడు నిర్మాత కూడా. అయితే డబ్బుల కోసమో, ప్యాషన్ కోసమో తను నిర్మాతగా మారలేదంటున్నాడు ఈ మలయాళ స్టార్. కేవలం తన సినిమాల్ని కాపాడుకోవడం కోసం నిర్మాతగా మారాల్సి వచ్చిందని చెబుతున్నాడు.
"మలయాళంలో సినిమాలు చేయడం మొదలుపెట్టిన తర్వాత కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. నా సినిమాలని నేను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఏవో కారణాల వలన కొందరు నిర్మాతలు అనుకున్న బడ్జెట్ ని సమకూర్చలేకపోవడం, సరిగ్గా విడుదల చేయలేకపోవడం జరిగేవి. దీని వలన ఎంతో కస్టపడి చేసిన సినిమాకి చాలా నష్టం జరిగేది. సినిమాని కాపాడాలి, మంచి సమయంలో రిలీజ్ చేయాలంటే మనమే నిర్మాణం, డిస్ట్రిబ్యుషన్ లో ఉండాలని వేఫేరర్ ఫిల్మ్స్ ని మొదలుపెట్టాను."
ఇలా ప్రొడ్యూసర్ గా మారడం వెనక రీజన్ ను బయటపెట్టాడు దుల్కర్. అయితే తెలుగులో మాత్రం తను నిర్మాతగా వ్యవహరించాల్సిన అవసరం లేదంటున్నాడు. ఇక్కడ చాలామంచి ప్రొడ్యూసర్లు ఉన్నారనేది దుల్కర్ మాట.
"ఇక్కడ మంచి నిర్మాతలు ఉన్నారు. ఇక్కడ అవసరం ఉండదనే భావిస్తాను. అయితే సినిమాని బట్టి, దానికి అవసరమైనప్పుడు నిర్మాణంలో సపోర్ట్ కావాలంటే మాత్రం చేస్తాను. ‘కాంత’ నేను, రానా కలసి చేస్తున్నాం. లక్కీ భాస్కర్ సితార ఎంటర్ టైమెంట్స్ నిర్మిస్తున్నారు. వారు చాలా మంచి ప్రోడ్యుసర్స్. ఇక వైజయంతి మూవీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిర్మాతగా నేను వాళ్ళ నుంచి, మిగతా పరిశ్రమల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకొని మలయాళంలో వాటిని అనుసరిస్తున్నాను."
ఇలా నిర్మాతగా కూడా జర్నీ కొనసాగిస్తున్న విషయాన్ని బయటపెట్టాడు దుల్కర్. ఈ హీరో నటించిన తాజా చిత్రం కింగ్ ఆఫ్ కోథ. మరో 4 రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాలో మాఫియా డాన్ గా నటించాడు దుల్కర్.