Telugu Global
Cinema & Entertainment

Kalki Movie | కల్కిలో 'సీతారామం' జోడీ?

Kalki Movie - కల్కి సినిమాలో విజయ్ దేవరకొండ, దుల్కర్, మృణాల్ ఉన్నారా..? మరికొన్ని గంటల్లో దీనిపై క్లారిటీ వస్తుంది.

Kalki Movie | కల్కిలో సీతారామం జోడీ?
X

ఓవైపు విడుదలకు సిద్ధమౌతున్నప్పటికీ, మరోవైపు కల్కి పై పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. సినిమాలో చాలా సర్ ప్రైజులున్నాయంటూ దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రకటించడమే దీనికి కారణం. తాజాగా ఈ సినిమాపై మరో ఊహాగానం వినిపిస్తోంది. కల్కి సినిమాలో సీతారామం జోడీ కూడా ఉందంట.

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారట. కథ ప్రకారం, సినిమాలో వాళ్లు కల్కి పాత్రకు తల్లిదండ్రులుగా నటించారట. ఈ మేటర్ లో నిజం ఎంతనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. అంతేకాదు, ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడనే ప్రచారం నడుస్తోంది. అతడు అర్జునుడు పాత్రలో కనిపిస్తాడట. దానిపై కూడా క్లారిటీ రాబోతోంది.

కల్కి సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. నిడివి దాదాపు 3 గంటలుంది. మరోవైపు ఈ సినిమాకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల నుంచి ప్రత్యేక అనుమతులు వచ్చేశాయి. మల్టీప్లెక్సుల్లో 100 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో 75 రూపాయలు పెంచుకునే తెలంగాణ సర్కారు వెసులుబాటు కల్పించగా.. సింగిల్ స్క్రీన్స్ లో 75 రూపాయలు, మల్టీప్లెక్సుల్లో ఏకంగా 125 రూపాయలు పెంచుకునేలా ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చింది. రెండు రాష్ట్రాల్లో రోజుకు 5 షోలు వేసుకునేందుకు అనుమతి దొరికింది. తెలంగాణలో 8 రోజులు ప్రత్యేక అనుమతులిస్తే, ఏపీలో ఏకంగా 14 రోజులు అనుమతులు మంజూరు చేశారు.

ఈ సినిమా మొదటి రోజు 200 కోట్ల రూపాయల గ్రాస్ సాధిస్తుందనే అంచనాలున్నాయి. అదే కనుక జరిగితే బాహుబలి-2, ఆర్ఆర్ఆర్ సినిమాల తర్వాత మొదటి రోజే 200 కోట్ల గ్రాస్ సాధించిన చిత్రంగా కల్కి నిలుస్తుంది.

First Published:  25 Jun 2024 3:50 PM GMT
Next Story