Telugu Global
Cinema & Entertainment

Lucky Baskhar | లక్కీ భాస్కర్ మొదటి సాంగ్ ఇదే

Lucky Baskhar - వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ హీరోగా నటిస్తున్న సినిమా లక్కీ భాస్కర్. ఈ సినిమా తొలి పాట విడుదలైంది.

Lucky Baskhar | లక్కీ భాస్కర్ మొదటి సాంగ్ ఇదే
X

వివిధ భాషలలో సినిమాలు చేస్తూ, దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. తెలుగులోనూ "మహానటి", "సీతారామం" వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న ఈ హీరో, ఇప్పుడు "లక్కీ భాస్కర్" అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.

''లక్కీ భాస్కర్'' సినిమాలో బ్యాంక్ క్యాషియర్‌గా మునుపెన్నడూ చూడని కొత్త లుక్‌లో దుల్కర్ సల్మాన్ కనిపిస్తున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకొని, సినిమాపై అంచనాలను పెంచేసింది. జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి "శ్రీమతి గారు" అనే మొదటి పాటను రిలీజ్ చేశారు.

జి.వి. ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ఈ మెలోడీ బాగుంది. వయోలిన్ తో మొదలై, ఫ్లూట్ మెలోడీగా మారి, డ్రమ్ బీట్‌లతో మరో స్థాయికి వెళ్లి.. జి.వి. ప్రకాష్ కుమార్ శైలిలో ఎంతో అందంగా సాగింది ఈ పాట. విశాల్ మిశ్రా, శ్వేతా మోహన్‌లు ఈ పాటను పాడగా.. శ్రీమణి సాహిత్యం అందించాడు.

1980-90 ల కాలంలో, అసాధారణ విజయాన్ని సాధించిన ఒక సాధారణ బ్యాంక్ క్యాషియర్ ప్రయాణాన్ని ''లక్కీ భాస్కర్'' చిత్రంలో చూపించబోతున్నారు. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.

First Published:  19 Jun 2024 7:34 AM GMT
Next Story