Telugu Global
Cinema & Entertainment

Mahesh Babu- మహేష్ వచ్చాడు కానీ షూటింగ్ డౌట్

Mahesh Babu - మరికొన్ని రోజుల్లో విదేశీ పర్యటన ముగిస్తున్నాడు మహేష్. అయితే హైదరాబాద్ వచ్చిన వెంటనే షూటింగ్ స్టార్ట్ చేయడం లేదు.

త్రివిక్రమ్ సినిమా.. ఇంటి సెట్ ఉండాల్సిందే
X

త్రివిక్రమ్ సినిమా.. ఇంటి సెట్ ఉండాల్సిందే

టైమ్ దొరికితే విదేశాలకు వెళ్లిపోతుంటాడు మహేష్. వేసవి మొదలైతే ఈ వలస మరింత ఎక్కువగా ఉంటుంది. అతడు విదేశాలకు వెళ్లిన ప్రతిసారి సినిమా షూటింగ్ ఆగిపోతుంది. తాజాగా మరోసారి మహేష్ ఫారిన్ వెళ్లాడు, మరికొన్ని రోజుల్లో తిరిగి హైదరాబాద్ కు వస్తున్నాడు. కానీ సినిమా షూటింగ్ మాత్రం మొదలయ్యేలా లేదు.

అవును.. మరికొన్ని రోజుల్లో విదేశాల నుంచి ఇంటికి రాబోతున్నాడు మహేష్. అయితే అతడు నటిస్తున్న సినిమా మాత్రం ఈ నెలలో సెట్స్ పైకి వచ్చేలా లేదు. హైదరాబాద్ వచ్చినా, కొత్త షెడ్యూల్ మాత్రం జూన్ నుంచే మొదలుపెట్టాలని భావిస్తున్నాడట మహేష్. దీనికి ప్రత్యేకంగా 2 కారణాలున్నాయి.

కొత్త షెడ్యూల్ కోసం కొత్త సెట్ ఇంకా రెడీ కాలేదంట. ఇదొక రీజనైతే.. గతంలో తీసిన కొన్ని సన్నివేశాల్ని పక్కన పెట్టాడట త్రివిక్రమ్. దానిపై కూడా మరోసారి చర్చించాల్సి ఉంది. ఈ రెండు కారణాల వల్ల ఈ నెలలో మహేష్ మూవీ సెట్స్ పైకి వచ్చేలా కనిపించడం లేదు.

పూజాహెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు నిర్మిస్తున్నారు.

First Published:  7 May 2023 1:19 PM
Next Story