అవును.. ఇది ఆ కోవకు చెందిన సినిమానే
థాంక్యూ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు దర్శకుడు విక్రమ్ కుమార్. సినిమా డీటెయిల్స్ బయటపెట్టాడు
నాగచైతన్య హీరోగా నటించిన సినిమా థాంక్యూ. ఈ సినిమా ట్రయిలర్ చూస్తున్నంతసేపు మనకు మై ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్, ప్రేమమ్ లాంటి సినిమాలు గుర్తొస్తాయి. అది నిజమే అంటున్నాడు దర్శకుడు విక్రమ్ కుమార్. తమ సినిమా ఆ కోవకే చెందుతుందని చెబుతున్నాడు.
"ప్రేమమ్, ఆటోగ్రాఫ్ సినిమాలు గొప్ప సినిమాలు. అలాంటి సినిమాలతో మా 'థాంక్యూ' సినిమాను పోల్చితే మాకు చాలా ప్లస్ అయినట్లే. ఇది ఒక వ్యక్తి జర్నీ. అలాంటి కోవకు చెందిన సినిమానే అయినా ఆ సినిమాలకు దీనికి టచ్ ఉండదు. మనం ఎదిగామంటే మనం మాత్రమే కారణం కాదు, మనకు ఎంతోమంది సహాయం చేసి ఉంటారు. వాళ్లందర్నీ గుర్తుచేసుకోవడం కోసమే ఈ థాంక్యూ సినిమా."
ఈ సినిమా ట్రయిలర్ లో నాగచైతన్య 3 డిఫరెంట్ షేడ్స్ లో కనిపించాడు. వాటిపై కూడా దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. 3 షేడ్స్ లో కనిపిస్తాడు కానీ, ఆ షేడ్స్ మధ్య వయసురీత్యా పెద్దగా తేడాలు ఉండవని చెబుతున్నాడు.
"ఇందులో నాగ చైతన్య మూడు వేరియేషన్స్‌లో కనిపిస్తారు. అందులో 16 ఏళ్ల పిల్లాడిలా కనిపించే పాత్ర ఒకటి. అలాగే 20-21 ఏళ్ల వయసుండే కుర్రాడిగా కనిపిస్తారు. తర్వాత 35-40 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తారు. 16 ఏళ్ల కుర్రాడిగా కనిపించటం కోసం చైతన్య చాలా కష్టపడ్డారు. 40-50 రోజుల పాటు స్పెషల్ డైట్ తీసుకుని బరువు తగ్గి తన లుక్‌ను మార్చుకున్నారు. ఆ పాత్రకు సంబంధించిన క్రెడిట్ అంతా నాగ చైతన్యకే దక్కుతుంది."
మనం తర్వాత నాగచైతన్య-విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో, థాంక్యూపై అంచనాలు పెరిగాయి. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా 22న థియేటర్లలోకి వస్తోంది.