Telugu Global
Cinema & Entertainment

Director Teja - రామానాయుడు కోసం అహింస చేశాడంట

Director Teja - అహింస మూవీ చేయడం వెనక అసలు కారణాన్ని బయటపెట్టాడు తేజ. రామానాయుడికి ఇచ్చిన మాట కోసం ఈ సినిమా చేశాడంట

Director Teja - రామానాయుడు కోసం అహింస చేశాడంట
X

దగ్గుబాటి వారసుడు అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ అహింస అనే సినిమా తీశాడు దర్శకుడు తేజ. 2వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతోంది. అయితే తేజ ఈ సినిమా తీయడం వెనక రీజన్ ఏంటనేది చాలామందిని తొలిచేస్తున్న ప్రశ్న. దీనికి సరైన సమాధానం ఇచ్చాడు ఈ డైరక్టర్.

"నేను రకరకాల మందిని పరిచయం చేశాను. అభిరాంనే ఎందుకు పరిచయం చేయాలి ? అభిరాం వాళ్ళకే సొంత నిర్మాణ సంస్థ ఉంది. వాళ్ళే చేసుకోవచ్చు. కానీ దీనికి కారణం రామానాయుడు గారు. మా మనవడితో సినిమా చేయాలని రామానాయుడు అడిగారు. చేస్తానని చెప్పాను. తర్వాత ఆయన ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు. కొన్నిరోజుల తర్వాత ఆయన వెళ్ళిపోయారు. అక్కడి నుంచి నాకు గిల్ట్ పట్టుకుంది. అంత పెద్ద మనిషి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా మాట తప్పాననే గిల్ట్ ఉండిపోయింది. అప్పుడు అభిరాం కోసం కథ రెడీ చేశాను. సురేష్ గారికి చెబితే ఆయన పెద్ద ఆసక్తి చూపలేదు. కొన్ని రోజులకు సరే అన్నారు. ఈ సినిమా రామానాయుడు గారి కోసం చేశాను."

ఇలా అహింస ప్రాజెక్టు వెనక కథను బయటపెట్టాడు తేజ. ఈ సినిమా కోసం అభిరామ్ ను బాగా కష్టపెట్టానని, తన దెబ్బకు హీరోహీరోయిన్లిద్దరూ సగం అయిపోయారని అన్నాడు తేజ.

అహింస రిలీజ్ తర్వాత మళ్లీ దగ్గుబాటి కాంపౌండ్ లోనే సినిమా చేస్తున్నాడు తేజ. రానా హీరోగా రాక్షస రాజు అనే ప్రాజెక్టును ప్రకటించాడు. అహింస రిలీజైన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది. ఇంతకుముందు రానా-తేజ కాంబోలో నేనేరాజు నేనే మంత్రి అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

First Published:  28 May 2023 5:30 PM IST
Next Story