Telugu Global
Cinema & Entertainment

గేమ్ ఛేంజ‌ర్ విడుద‌లపై శంక‌ర్ బిగ్ అప్‌డేట్‌

శంక‌ర్ ఇచ్చిన ఈ అప్‌డేట్‌తో మెగా ఫ్యాన్స్ కాస్త ఊర‌ట ల‌భించింది. కాగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు, శిరీష్ క‌లిసి నిర్మిస్తున్న గేమ్ ఛేంజ‌ర్ లో రామ్ చ‌ర‌ణ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు.

గేమ్ ఛేంజ‌ర్ విడుద‌లపై శంక‌ర్ బిగ్ అప్‌డేట్‌
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ `గేమ్ ఛేంజర్`. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత చరణ్ సోలోగా చేస్తున్న పెద్ద ప్రాజెక్ట్‌ ఇది. అయితే ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు ముందే ఈ సినిమా ప్రారంభం అయినా కూడా గేమ్ ఛేంజ‌ర్ విడుదలపై ఎటువంటి స్ప‌ష్ట‌త రాలేదు. ఈ విషయం పట్ల మెగా ఫాన్స్ చిత్ర యూనిట్ పై ఎప్పటినుంచో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఇండియ‌న్- 2 ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న డైరెక్టర్ శంకర్.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో గేమ్ ఛేంజ‌ర్ రిలీజ్ పై బిగ్ అప్‌డేట్‌ ఇచ్చారు. శంక‌ర్ మాట్లాడుతూ.. `సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. మ‌రో 10 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇండియన్ -2 రిలీజ్ అవగానే గేమ్ ఛేంజ‌ర్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తాము. ఫైనల్ ఫుటేజ్ లాక్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెడ‌తాను. పనుల‌న్ని పూర్తయ్యాక సినిమాను ఎప్పుడు విడుదల చేయాలనేది నిర్ణయించి వీలైనంత త్వరగా ప్ర‌క‌టిస్తాము` అని చెప్పుకొచ్చారు.

శంక‌ర్ ఇచ్చిన ఈ అప్‌డేట్‌తో మెగా ఫ్యాన్స్ కాస్త ఊర‌ట ల‌భించింది. కాగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు, శిరీష్ క‌లిసి నిర్మిస్తున్న గేమ్ ఛేంజ‌ర్ లో రామ్ చ‌ర‌ణ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజ‌లి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, జయరామ్, సునీల్, సముద్రకని త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషిస్తుండ‌గా.. థ‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఇటీవ‌ల గేమ్ ఛేంజ‌ర్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఫ‌స్ట్ సింగిల్ జరగండి సాంగ్ కు రెస్పాన్స్ ఎలా వ‌చ్చిందో తెలిసిందే.

First Published:  27 Jun 2024 6:39 AM GMT
Next Story