Telugu Global
Cinema & Entertainment

ఇది పేకాట.. ఇలాగైతే ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు - పూరి

ఏంటి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా? అంటూ పూరి ఫైర్ అయ్యారు. తాను బయర్లకు డబ్బు తిరిగి ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నానని.. ఒక నెల సమయం అడిగానని.. అందుకు వాళ్లు కూడా అంగీకరించారని.. మరి ఇప్పుడు కొత్తగా ఈ బ్లాక్‌మెయిల్ చేయడం ఏమిటని ప్రశ్నించారు.

ఇది పేకాట.. ఇలాగైతే ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు - పూరి
X

లైగర్ సినిమా విఫలంతో దర్శకుడు పూరి జగన్నాథ్‌కు, బయర్లు, ఎగ్జిబిటర్స్‌కు మధ్య వివాదం ముదురుతోంది. ఈనెల 27న పూరి ఇంటి ధర్నాకు ఎగ్జిబిటర్స్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క ఎగ్జిబిటర్ రావాల్సిందిగా వాట్సాప్‌లో పిలుపునిచ్చుకున్నారు. ఈ చాట్‌ను దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. అనంతరం దీనిపై పూరి జగన్నాథ్ ఒక ఆడియో విడుదల చేశారు.

ఏంటి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా? అంటూ పూరి ఫైర్ అయ్యారు. తాను బయర్లకు డబ్బు తిరిగి ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నానని.. ఒక నెల సమయం అడిగానని.. అందుకు వాళ్లు కూడా అంగీకరించారని.. మరి ఇప్పుడు కొత్తగా ఈ బ్లాక్‌మెయిల్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. కేవలం వాళ్లు కూడా నష్టపోయారన్న ఉద్దేశంతో, పరువు పోకూడదన్న ఉద్దేశంతోనే బయర్లకు డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించానని పూరి చెప్పారు. ఇప్పుడు అదే పరువు తీసేందుకు ప్రయత్నిస్తే ఇకపై ఒక్కడికీ ఒక్క రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. ఇలా ఓవరాక్షన్ చేస్తే ఇవ్వాలనుకున్న అమౌంట్ కూడా ఎందుకిస్తానని ప్రశ్నించారు.

ఇక్కడ అందరం గ్యాంబ్లింగ్ చేస్తున్నాం.. పేకాట ఆడుతున్నాం. కొన్ని ఆడుతాయి. కొన్ని పోతాయి. పోకరి దగ్గర నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు తనకూ బయర్ల నుంచి చాలా అమౌంట్ రావాల్సింది ఉంది.. మరి బయర్స్ అసోసియేషన్ వసూలు చేసి ఇస్తుందా అని పూరి ప్రశ్నించారు. సినిమా తీసేటప్పుడు బాగానే ఉంటోందని.. కానీ రిలీజ్ టైంకు వీరందరినీ డీల్ చేయలేకపోక చిరాకు వస్తోందంటూ అంటూ పూరి బూతులు తిట్టారు. ఇక్కడ ఒక్క మగాడు కూడా లేరని ఫైర్ అయ్యారు. నార్త్‌లో బయర్ ఖచ్చితమైన లెక్కలు చెప్పారని.. నార్త్ బయర్ వస్తే కూర్చోని మరికొద్దిసేపు మాట్లాడాలనిపిస్తుందని.. ఇక్కడి బయర్లు వస్తే మాత్రం అక్కడి నుంచి దెం - - అని అనిపిస్తుందని బూతులు అందుకున్నారు పూరి. తన ఇంటి ముందు ధర్నా చేస్తే చేయండి.. ధర్నా చేసిన వారికి తప్ప మిగిలిన వారికి మాత్రమే అకౌంట్ వెనక్కు ఇస్తా అంటూ పూర్తి జగన్నాథ్ స్పష్టం చేశారు.

First Published:  25 Oct 2022 9:32 AM IST
Next Story