Telugu Global
Cinema & Entertainment

Puri Jagannadh: పూరి పాడ్ కాస్ట్.. ఈసారి ఉత్తరం రూపంలో..!

Puri Jagannadh: దర్శకుడు పూరి జగన్నాధ్ ఓపెన్ లెటర్ రాశారు. మరోసారి తన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తూనే, తాత్వికతను బోధించారు.

Puri Jagannadh: పూరి పాడ్ కాస్ట్.. ఈసారి ఉత్తరం రూపంలో..!
X

దర్శకుడు పూరి జగన్నాధ్

పూరి జగన్నాధ్ పాడ్ కాస్ట్ కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతడు చెప్పే విషయాలు అందర్నీ ఆలోచింపజేస్తాయి. సూటిగా సుత్తిలేకుండా పాడ్ కాస్ట్ లో ఎన్నో అంశాల్ని ప్రస్తావించాడు పూరి జగన్నాద్.

మరి అలాంటి పాడ్ కాస్ట్ విశేషాలు, ఓ లేఖ రూపంలో వస్తే ఎలా ఉంటుంది. సరిగ్గా అలాంటి సందర్భమే ఇది. పూరి జగన్నాధ్ మీడియాకు రాసిన ఓ లేఖలో ఆలోచనలు రేకెత్తించే విశేషాలు చాలా ఉన్నాయి.

లైగర్ సినిమాకు సంబంధించి ప్రస్తుతం బయ్యర్లతో సమస్యలు ఎదుర్కొంటున్నాడు పూరి. దీనికి సంబంధించి కొందరిపై పోలీస్ కంప్లయింట్ కూడా ఇచ్చాడు. ఈ నేపథ్యంలో తన లేఖలో పూరి ప్రస్తావించిన అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆ లేఖలోని అంశాల్ని యథాతథంగా ఇక్కడ ఇస్తున్నాం..

- సక్సెస్-ఫెయిల్యూర్.. ఈ రెండూ ఆపోజిట్ అనుకుంటాం, కాదు. ఈ రెండూ ఫ్లో లో ఉంటాయి. ఒకదాని తర్వాత ఇంకొకటి వస్తాయి. గుండెల నిండా ఊపిరి పీలిస్తే బతుకుతామని అనుకుంటాం. కానీ వెంటనే చెయ్యాల్సిన పని ఏంటి? ఊపిరి వదిలెయ్యటమే. పడతాం,లేస్తాం. ఏడుస్తాం, నవ్వుతాం. ఎన్నో రోజులు ఏడ్చినాక నెక్ట్స్ జరిగేది ఏంటి? పగలబడి నవ్వటమే

- ఇక్కడ ఏదీ పర్మనెంట్ కాదు .. లైఫ్ లో మనకి జరిగే ప్రతి సంఘటనని మనం ఒక ఎక్స్ పీరియన్స్ లా చూడాలి తప్ప, పెయిల్యూర్, సక్సెస్ లా చూడకూడదు. నడిచా, మెట్లు ఎక్కా, పడిపోయా, కాలుజారింది, నదిలో పడ్డా, కొట్టుకుపోయా, ఒడ్డుకు చేరా, ఇంట్లో తిట్టారు, ఊరు వేలేసింది, ఉరేసుకోవాలనిపించింది, ఎవడో కాపాడాడు, వాడు నేను కౌగిలించుకున్నాం, వాడే మోసం చేశాడు, ఇలా ఎన్నెన్నో లైఫ్ లో జరుగుతుంటాయి. అవన్నీ సీన్లే. అందుకే లైఫ్ ని సినిమా లా చూస్తే, షో అయిపోగానే మర్చిపోవచ్చు. మైండ్ కి తీసుకుంటే మెంటల్ వస్తది.

- సక్సెస్ ఐతే డబ్బులొస్తాయి. ఫెయిల్ అయితే బోలెడు జ్ఞానం వస్తాది. ఎప్పుడూ మనం మెంటల్లీ, ఫైనాన్షియల్లీ గెయిన్ అవుతూనే ఉంటాం తప్ప, ఈ ప్రపంచంలో మనం కోల్పోయేది ఏదిలేదు. అందుకే దేన్నీ ఫెయిల్యూర్ గా చూడొద్దు . బ్యాడ్ జరిగితే మన చుట్టూ ఉన్న బ్యాడ్ పీపుల్ మాయమైపోతారు .. వెనక్కి తిరిగి చూస్తే ఎవడు మిగిలాడో తెలుస్తుంది. మంచిదే కదా?

- ఖాళీగా ఉండకూడదు. ఏదోకటి చెయ్యాలి .. అది రిస్క్ అవ్వాలి. లైఫ్ లో రిస్క్ చెయ్యకపోతే అది లైఫే కాదు. ఏ రిస్క్ చెయ్యకపోతే అది ఇంకా పెద్ద రిస్క్. లైఫ్ లో నువ్వు హీరో ఐతే, సినిమాలో హీరోకి ఎన్ని జరిగాయో అవన్నీ నీకు కూడా జరుగుతాయి. పొగుడుతారు, నిందిస్తారు, బొక్కలో వేస్తారు, మళ్ళీ విడుదల చేస్తారు, అందరూ క్లాప్స్ కొడతారు, అక్షింతలు వేస్తారు.

- సో ఇవన్నీ మీ లైఫ్ లో జరగకపోతే, జరిగేలా చూడండి. లేకపోతె మీరు హీరో కాదేమో అనుకొనే ప్రమాదం ఉంది. అందుకే మనం హీరో లా బతకాలి. బతకాలి అంటే నిజాయితీగా ఉండాలి. నేను నిజాయతీపరుడుని అని చెప్పుకొనవసరం లేదు. నిజాన్ని కాపాడాల్సిన అవసరం లేదు. నిజాన్ని నిజమే కాపాడుకుంటుంది.

- ఎవరినుంచి ఏదీ ఆశించకుండా, ఎవరినీ మోసం చేయకుండా మన పని మనం చేసుకుంటూ పొతే మనల్ని పీకే వాళ్ళు ఎవరూ ఉండరు. నేను ఎప్పుడైనా మోసం చేస్తే, దగా చేస్తే అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న ఆడియన్స్ ని తప్ప, నేను ఎవరినీ మోసం చెయ్యలేదు. నా ప్రేక్షకులకే నేను జవాబుదారీ. మళ్ళీ ఇంకో సినిమా తీస్తా . వాళ్ళని ఎంటర్ టైన్ చేస్తా. ఇక డబ్బు అంటారా? చచ్చినాక ఇక్కడ నుండి ఒక్క రూపాయి తీసుకెళ్లినోడి, ఒక్కడి పేరు నాకు చెప్పండి, నేనూ దాచుకుంటా. ఫైనల్ గా అందరం కలిసేది స్మశానంలోనే .. మధ్యలో జరిగేది అంతా డ్రామా.

First Published:  30 Oct 2022 5:00 PM IST
Next Story