Telugu Global
Cinema & Entertainment

Circle Movie - లాంగ్ గ్యాప్ తర్వాత నీలకంఠ నుంచి సినిమా

Circle movie teaser - లాంగ్ గ్యాప్ తర్వాత నీలకంఠ దర్శకత్వంలో వస్తున్న సినిమా సర్కిల్. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది.

Circle Movie - లాంగ్ గ్యాప్ తర్వాత నీలకంఠ నుంచి సినిమా
X

నేషనల్ అవార్డ్ విన్నింగ్ దర్శకుడు నీలకంఠ, లాంగ్ గ్యాప్ తర్వాత మరో సినిమా రెడీ చేశాడు. గతంలో "షో" అనే ఫీచర్ ఫిల్మ్ తో రెండు జాతీయ అవార్డులు, అలాగే "విరోధి" , "షో" చిత్రాలకు గాను ఇండియన్ పనోరమ లో కూడ సెలెక్ట్ అయిన దర్శకుడు నీలకంఠ.. ఆ తర్వాత మిస్సమ్మ, సదా మీ సేవలో వంటి సినిమాలతో ఆకట్టుకున్నారు. సినిమాల నుండి కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు మరోసారి "సర్కిల్" అనే చిత్రంతో వస్తున్నారు. "ఎవరు, ఎప్పుడు, ఎందుకు శత్రువులవుతారో" అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్ కూడా బాగా ఆకట్టుకుంటోంది.

ఈమధ్య రిలీజ్ చేసిన ఈ సినిమా మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా టీజర్ విడుదల చేశారు. సర్కిల్ ఆఫ్ లైఫ్, సర్కిల్ ఆఫ్ డెత్, సర్కిల్ ఆఫ్ ఫేట్.. ఈ మూడు అంశాల కలయికతో ఈ సినిమా టీజర్ కట్ చేశారు. తన పాత్రలోని ఎమోషన్స్ ను సాయిరోనక్ బాగా చూపించాడు. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా హీరో పాత్ర ఒక సర్కిల్లోకి వెళ్తుంది. ఎవరు శత్రువు, ఎవరు మిత్రుడు అని తెలుసుకోలేని సందిగ్ధంలో పడతాడు. ఈ ప్రాబ్లమ్స్ ని దాటుకుని తను బయటకు రాగలిగాడా లేదా అనేది ఈ సినిమా కథ.

టీజర్ లో హీరోయిన్లు అర్షిన్ మెహతా, రిచా పనయ్ కు కూడా స్థానం కల్పించారు. అయితే వాళ్లతో ఎలాంటి డైలాగ్స్ పెట్టలేదు. సస్పెన్స్ మెయింటైన్ అయ్యేలా విజువల్స్ అన్నీ చూపించారు. ప్రశు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రంగనాధ్ గోగినేని సినిమాటోగ్రఫీ టీజర్ లో హైలెట్ గా నిలిచాయి.

త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు. ఈ మూవీతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు నీలకంఠ. గతంలో ఇతడు డైరక్ట్ చేసిన ఓ సినిమా, హీరోయిన్ తో గొడవ కారణంగా ఆగిపోయింది. అప్పట్నుంచి కెరీర్ లో గ్యాప్ ఎదుర్కొంటున్న ఈ దర్శకుడు.. ఇప్పుడు సర్కిల్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.



First Published:  6 Jun 2023 5:00 PM IST
Next Story