Telugu Global
Cinema & Entertainment

Waltair Veerayya: రవితేజ పాత్ర అలా పుట్టింది

Waltair Veerayya - ఈ సినిమాలో చిరంజీవితో పాటు రవితేజ కూడా నటించాడు. మరి అతడి కోసం ఈ సినిమాలో పాత్ర ఎలా పుట్టింది?

Waltair Veerayya: రవితేజ పాత్ర అలా పుట్టింది
X

వాల్తేరు వీరయ్య.. చిరంజీవి హీరోగా నటించిన సినిమా. ఇందులో ఓ కీలక పాత్రలో రవితేజ కూడా నటించాడు. మరి రవితేజ ఈ ప్రాజెక్టులోకి ఎలా వచ్చాడు? కథలో ముందునుంచే రవితేజ పాత్ర ఉందా? లేక ఆఖరి నిమిషంలో వచ్చాడా? దీనిపై దర్శకుడు బాబి స్పందించాడు.

"చిరంజీవి గారికి కథ చెప్పాను. ఓకే అయిపోయింది. కొన్ని బ్లాక్స్ మార్చమని చెప్పారు. దానిపై వర్క్ చేస్తున్నప్పుడు కరోనా వచ్చింది. ఆ టైమ్ లో చాలా వెబ్ సిరీస్ లు, వరల్డ్ సినిమా చూశాను. అప్పుడు ఓ పాత్ర నా మైండ్ లోకి వచ్చింది. అలాంటి పాత్ర వాల్తేరు వీరయ్యలో కూడా ఉంటే బాగుంటుందని ఫీల్ అయ్యాను. వెంటనే ఆ పాత్రను కథలో పెట్టాను. అదే రవితేజ పాత్ర. చిరంజీవికి చెప్పకుండానే ఇలా మరో హీరోను కథలో పెట్టేశాను. చిరంజీవికి చెబితే ఏం అంటారో అనే టెన్షన్. మొత్తానికి చెప్పేశాను. వెంటనే చిరంజీవి ఒప్పుకున్నారు."

ఇలా వాల్తేరు వీరయ్యలోకి రవితేజ వచ్చిన విషయాన్ని బయటపెట్టాడు బాబి. చిరంజీవి ఓకే చెప్పిన తర్వాత, 6 నెలల పాటు రవితేజతో ట్రావెల్ చేశానని, కానీ తనకు ఎప్పుడూ ఈ కథ ఉందని చెప్పలేదని, ఓ టైమ్ చూసి ఈ కథ చెప్పానని అన్నాడు.

3 సీన్లు చెప్పిన వెంటనే రవితేజ ఓకే చెప్పేశారని, పైగా అన్నయ్య మూవీ అవ్వడంతో అస్సలు ఆలోచించలేదని అన్నారు. అలా వాల్తేరు వీరయ్యలోకి రవితేజ వచ్చారని, చిరు-రవితేజ మధ్య వచ్చే సన్నివేశాలు హైలెట్ గా ఉంటాయంటున్నాడు.

First Published:  28 Dec 2022 10:32 AM IST
Next Story