Telugu Global
Cinema & Entertainment

Director Atlee: తల్లిదండ్రులు కాబోతున్న ప్రియ-అట్లీ

Director Atlee: బ్లాక్ బస్టర్ డైరక్టర్ అట్లీ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. పెళ్లయిన 8 ఏళ్లకు అట్లీ-ప్రియ దంపతులు తల్లిదండ్రులుగా మారబోతున్నారు.

Director Atlee: తల్లిదండ్రులు కాబోతున్న ప్రియ-అట్లీ
X

సూపర్ హిట్ డైరెక్టర్ అట్లీ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, తన టేకింగ్ తో కమర్షియల్ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లాడు. 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ బిగిల్ తో భారతదేశపు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు అట్లీ. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో సినిమా చేస్తున్నాడు.

అట్లీ, కృష్ణ ప్రియ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వారిద్దరూ కలి "A ఫర్ ఆపిల్" అనే ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించి, బ్యానర్ లో రెండు చిత్రాలను కూడా నిర్మించారు.

వీళ్లిద్దరూ పెళ్లి చేసుకొని 8 ఏళ్లు అవుతోంది. ఇప్పుడీ జంట తమ వైవాహిక జీవితంలో కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్నారు. త్వరలోనే అట్లీ తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని భార్యభర్తలిద్దరూ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు.

అట్లీ ప్రకటనతో కోలీవుడ్ ప్రముఖులు చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు.




First Published:  17 Dec 2022 6:07 PM IST
Next Story