Telugu Global
Cinema & Entertainment

హోంశాఖ ముఖ్య కార్యదర్శితో దిల్‌ రాజు సమావేశం

టీఎఫ్‌డీసీ చైర్మన్, సినీ నిర్మాత దిల్ రాజు ఇవాళ తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తాతో సమావేశమయ్యారు.

హోంశాఖ ముఖ్య కార్యదర్శితో దిల్‌ రాజు సమావేశం
X

తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (టీఎఫ్‌డీసీ) చైర్మన్, సినీ నిర్మాత దిల్ రాజు ఈరోజు తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తాతో సమావేశమయ్యారు. వివిధ అంశాలపై వారి మధ్య చర్చ జరిగింది. సినిమా పరిశ్రమలో ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ కార్యకలాపాలపై చర్చిస్తున్నారు. థియేటర్ల లైసెన్స్‌ల గడువు సులభంగా ఉండాలనే అంశంపై వారి మధ్య చర్చ జరిగింది. దిల్ రాజుతో పాటు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సునీల్ నారంగ్, పలువురు ఎగ్జిబిటర్లు హాజరయ్యారు.

కాగా ఇటీవలే పలువురు సినిమా ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సినిమా వాళ్లతో సెటిల్​మెంట్ చేసుకుని ఇప్పుడు ఏం మాట్లాడట్లేదని ఆరోపించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన దిల్ రాజ్ చిత్ర పరిశ్రమను వివాదాల్లోకి లాగొద్దని, రాజకీయాలను ఆపాదించవద్దని కోరారు. ఈ క్రమంలో ఇవాళ హోంశాఖ ముఖ్య కార్యదర్శితో దిల్ రాజ్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సునీల్ నారంగ్, పలువురు ఎగ్జిబిటర్లు హాజరయ్యారు.

First Published:  3 Jan 2025 3:45 PM IST
Next Story