Telugu Global
Cinema & Entertainment

శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్‌రాజు..రేవతి భర్తకు ఉద్యోగ హామీ

కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను దిల్‌ రాజు పరామర్శించారు.

శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్‌రాజు..రేవతి భర్తకు ఉద్యోగ హామీ
X

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అపాయింట్‌మెంట్ కోరామని రేపు లేదా ఎల్లుండి ముఖ్యమంత్రిని కలుస్తామని ఫిల్మ్ డెవలప్మెంట్ ఛైర్మన్, నిర్మాత దిల్‌ రాజు తెలిపారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తోను సమావేశమవుతానన్నారు. కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను దిల్‌ రాజు పరామర్శించారు. శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితిని వైద్యలను అడిగి తెలుకుకొన్నారు, కుటుంబ సభ్యులతో దిల్‌ రాజు మాట్లాడారు. దిల్‌ రాజు రేవతి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. అవసరమైతే రేవతి భర్త భాస్కర్‌కు ఇండస్ట్రీలో పర్మినెంట్ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

రేవతి కూతురు భవిష్యత్‌ బాధ్యతను తాము తీసుకుంటామని ప్రకటించారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తాం.. తర్వాత జరగాల్సిన వాటిపై చర్చిస్తామని అన్నారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. రెండ్రోజుల్లో వెంటిలేటర్‌ పైనుంచి షిఫ్ట్ చేస్తామని డాక్టర్లు చెప్పారని అన్నారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు జరగాలని ఎవరూ కోరుకోరని తెలిపారు. ప్రజలకు మీడియా వాస్తవాలు చూపించాలని కోరారు. అమెరికా నుంచి రాగానే సీఎం రేవంత్ రెడ్డిని, నటుడు అల్లు అర్జున్‌ను ఇద్దరినీ కలిశానని దిల్‌ రాజు అన్నారు.

First Published:  24 Dec 2024 5:12 PM IST
Next Story