Telugu Global
Cinema & Entertainment

10 స్క్రిప్టులు ఆపేశాను.. 2 సినిమాలు నిలిపేశాను

ప్రేక్షకుల అభిరుచి మారిపోయిందంటున్నారు దిల్ రాజు. అందుకే తన బ్యానర్ నుంచి రావాల్సిన 2 సినిమాల్ని ఆపేశాననని ప్రకటించారు.

10 స్క్రిప్టులు ఆపేశాను.. 2 సినిమాలు నిలిపేశాను
X

కరోనా తర్వాత ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయిందంటున్నారు దిల్ రాజు. ఓ మోస్తరు కంటెంట్ తో సినిమా తీస్తే ఆడియన్స్ థియేటర్ల వైపు చూడడం లేదంటున్నారు. తాజాగా వచ్చిన ది వారియర్, అంతకంటే ముందొచ్చిన అంటే సుందరానికి సినిమాలు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని చెబుతున్నారు రాజు.

మారిన ప్రేక్షకుల అభిరుచి, సినిమా ట్రెండ్స్ ను దృష్టిలో పెట్టుకొని తన గేమ్ ప్లాన్ పూర్తిగా మార్చేశానంటున్నారు దిల్ రాజు. ఈ క్రమంలో ఆల్రెడీ ఓకే చేసిన 10 స్క్రిప్టులు ఆపేశానంటూ సంచలన ప్రకటన చేశారు.

"ప్రేక్షకుల అభిరుచి మారింది. దీంతో నా ఫిలిం మేకింగ్ స్టయిల్ కూడా మార్చుకోవాల్సి వచ్చింది. కరోనా టైమ్ లో 10 స్క్రిప్టులు ఓకే చేశాను. అవన్నీ పక్కన పెట్టాను. 2 కొత్త సినిమాలు ప్రారంభించి సెట్స్ పైకి వెళ్లాలి. అవి కూడా ఆపేశాను. నేను మాత్రమే ఆపేస్తే సరిపోదు. అందరూ అర్థం చేసుకొని, అంతా సినిమాలు ఆపేయాలి. దయచేసి తొందరపడి సినిమాలు స్టార్ట్ చేయొద్దు. ప్రేక్షకుల మైండ్ సెట్ మారింది. చెక్ చేసుకోండి. ఇప్పుడు ఓ సినిమా స్టార్ట్ అయితే, ఏడాది తర్వాత రిలీజ్ అవుతుంది. అప్పటికి ప్రేక్షకుడి మైండ్ సెట్ మారిపోతుంది. ఇది మాకు పెద్ద ఛాలెంజ్."

ఇలా ప్రేక్షకుల మైండ్ సెట్ మారడంతో, తన గేమ్ ప్లాన్ కూడా మారిన విషయాన్ని దిల్ రాజు బయటపెట్టారు. శంకర్-చరణ్ సినిమా పూర్తయిన తర్వాత చిన్న పాజ్ తీసుకొని, కంటెంట్ పై వినూత్నమైన ఆలోచనలతో ముందుకొస్తానని ప్రకటించారు.

First Published:  18 July 2022 6:32 PM IST
Next Story