Dil Raju Movies: ఒకేసారి 3 సినిమాలు ప్రకటించిన దిల్ రాజు
Dil Raju Movies announced big movies : దిల్ రాజు వరుసగా సినిమాలు ప్రకటించారు.

గ్యాప్ లేకుండా సినిమాలు తీయడం దిల్ రాజు స్పెషాలిటీ. సంక్రాంతి సందర్భంగా వారసుడు సినిమాను రిలీజ్ చేసిన ఈ నిర్మాత, ప్రస్తుతం రామ్ చరణ్-శంకర్ సినిమాను నిర్మిస్తున్నాడు. వీటితో పాటు తన బ్యానర్ పై రాబోయే క్రేజీ మూవీస్ ను ప్రకటించాడు.
ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో ‘జటాయు’ అనే సినిమా నిర్మించబోతున్నాడు దిల్ రాజు. దీంతో పాటు శైలేష్ కొలను డైరెక్షన్ లో ‘విశ్వంభర’ అనే మూవీ ప్లాన్ చేశాడు.
ఈ సినిమాలతో పాటు.. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ‘రావణం’ అనే సినిమా చేయబోతున్నాడు దిల్ రాజు. ఇలా తను చేయబోయే సినిమాలన్నింటినీ టైటిల్స్ తో పాటు ప్రకటించాడు దిల్ రాజు. అయితే ఈ ప్రాజెక్టుల్లో హీరోలు ఎవరనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. సమయం వచ్చినప్పుడు ఒక్కొక్కటి ప్రకటిస్తానని తెలిపాడు.
ప్రశాంత్ నీల్ తో దిల్ రాజు నిర్మించబోతున్న రావణం అనే ప్రాజెక్ట్ పై మూవీ లవర్స్ ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ఈ కాంబోలో రానున్న సినిమాలో హీరో ఎవరు ? ఎలాంటి కథతో రాబోతుంది ? అనేది హాట్ టాపిక్ గా మారింది.