తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన దిల్ రాజు
ప్రముఖ నిర్మాత, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు తెలిపాడు
తెలంగాణ ప్రజలకు ప్రముఖ దర్శకుడు దిల్‌రాజ్ క్షమాపణలు చెప్పారు. సంక్రాంతి వస్తున్నాం ఈవెంట్‌లో ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే తెలంగాణ ప్రజలు తనను క్షమించాలని కోరారు. నిజామాబాద్ జిల్లా వాసిగా ఈ సినిమా ఈవెంట్‌ను నిర్వహించా కానీ ఆ వేడుకలో తెలంగాణ సంస్కృతిలో ఉండే దావత్ గురించి మాట్లాడా నేను తెలంగాణ సంస్కృతిని అభిమానించేవాడిని పేర్కొన్నారు. నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు అంటూ విజ్ఞప్తి చేశారు. ‘మన సంస్కృతిలో ఉండే దావత్ గురించి, మటన్, తెల్ల కల్లు గురించి మాట్లాడాను. ఆ మాటల్లో తెలంగాణ వాళ్లను అవమానించానని, అవహేళన చేశానని కొంతమంది మిత్రులు కామెంట్లు చేసి, సోషల్ మీడియాలో పెట్టారని తెలిసింది. తెలంగాణ దావత్ నేను మిస్సవుతున్నాను.
సంక్రాంతికి వస్తున్న ఈ రెండు సినిమాలు విడుదలయ్యాక దావత్ చేసుకోవాలని ఉంది అని చెప్పటం నా ఉద్దేశం’’ అని దిల్ రాజు అన్నారు. నిజామాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు మేకర్స్. అయితే ఈ వేడుకలో దిల్ రాజు మాట్లాడుతూ.. ఆంధ్రాలో సినిమాకు ఓ వైబ్ ఇస్తారు. మన దగ్గర (తెలంగాణలో) కల్లు, మటన్ కు వైబ్ ఇస్తాం. చలికాలం చెట్లలోకి పోయి కల్లు తాగుదాం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో పాటు తెలంగాణ ప్రజలంటే తాగుబోతులా అంటూ దిల్ రాజు అనడం కరెక్ట్ కాదని ఈ విషయంలో దిల్ రాజు వెంటనే క్షమాపణలు చెప్పాలని ప్రజలు కోరారు.