Dhruva Nakshatram | ధృవనక్షత్రం.. మరో విడుదల తేదీ
Dhruva Nakshatram - విక్రమ్ హీరోగా నటించిన ధృవనక్షత్రం సినిమాకు మరో విడుదల తేదీ ఫిక్స్ చేశారు. 30న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Dhruva Nakshatram Movie Trailer Review | విక్రమ్ సినిమా ట్రయిలర్ ఎలా ఉందంటే?
ధృవ నక్షత్రం విడుదల తేదీ వివరాలు బయటకు వచ్చాయి. విక్రమ్, గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 24న విడుదల కావాల్సి ఉంది. కానీ ఫైనాన్షియల్ ఇష్యూష్ కారణంగా ఆఖరి నిమిషంలో వాయిదా పడింది. ఇప్పుడీ సినిమాను 30వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించారు. 28వ తేదీ నాటికి ఈ సినిమాకు సంబంధించిన ఫైనాన్స్ మేటర్స్ అన్నీ క్లియర్ అవుతాయని అందరూ భావిస్తున్నారు. ఒకవేళ ఫైనాన్స్ మేటర్స్ క్లియర్ అయితే, 28వ తేదీన దర్శకనిర్మాత గౌతమ్ మీనన్ ప్రకటన చేస్తాడు.
ధృవనక్షత్రం వాయిదా పడడం ఇదే తొలిసారి కాదు. ఈ చిత్రం 2017లో సెట్స్‌పైకి వెళ్లింది కానీ ఇంకా విడుదల కాలేదు. అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయలేకపోయినందుకు గౌతమ్ అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించిన గౌతమ్, భారీగా ఫైనాన్స్ తెచ్చాడు.
ఆ వడ్డీలు కట్టలేక, నటుడిగా కూడా మారాడు. సినిమాల్లో నటిస్తూ వచ్చిన డబ్బుతో వడ్డీలు కడుతున్నాడు. ఎలాగోలా ధృవనక్షత్రాన్ని విడుదలకు సిద్ధం చేశాడు. అంతా ఓకే అనుకున్న టైమ్ లో ఆఖరి నిమిషంలో ఫైనాన్స్ మేటర్స్ సెటిల్ చేయలేకపోయాడు. దీంతో మరోసారి సినిమా వాయిదా పడింది.
పార్తిబన్, ఐశ్వర్య రాజేష్, సిమ్రాన్, రాధిక, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్ గా నటించింది. హరీశ్ జైరాజ్ సంగీతం అందించాడు. రీసెంట్ గా రిలీజైన ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.