Telugu Global
Cinema & Entertainment

Raayan | రాయన్ రిలీజ్ డేట్ ఫిక్స్

Dhanush's Raayan Movie - ధనుష్ 50వ చిత్రం రాయన్. స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ తెరకెక్కిస్తున్న సినిమా ఇది.

Raayan | రాయన్ రిలీజ్ డేట్ ఫిక్స్
X

నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్టార్ ధనుష్ హీరోగా తన 50వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సందీప్ కిషన్ మరో లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ 'రాయన్'. కాళిదాస్ జయరామ్‌ మరో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మేకర్స్ రాయన్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. జూన్ 26న ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి తెలుగు వెర్షన్‌ను గ్రాండ్ గా విడుదల చేయనుంది. ఈ సందర్భంగా మరో పోస్టర్ రిలీజ్ చేశారు.

భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో ఎస్‌జె సూర్య, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి, ధుషార విజయన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ఓం ప్రకాష్ కెమెరా హ్యాండిల్ చేస్తున్నారు.




First Published:  11 Jun 2024 5:41 PM GMT
Next Story