Telugu Global
Cinema & Entertainment

Raayan | ధనుష్ సినిమా సెన్సార్ టాక్

Raayan Movie - ధనుష్ 50వ సినిమా రాయన్. దీనికి అతడే దర్శకుడు. సినిమా సెన్సార్ పూర్తయింది.

Raayan | ధనుష్ సినిమా సెన్సార్ టాక్
X

నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించిన సినిమా రాయన్. కెరీర్ లో ధనుష్ కు ఇది 50వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ ఇతర లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. తాజాగా రాయన్ చిత్రం సెన్సార్ పూర్తచేసుకుంది. సెన్సార్ బోర్డ్ సినిమాకి ఏ-సర్టిఫికేట్ ఇచ్చింది.

యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా 2 గంటల 25 నిమిషాలుంది. మరో 2 వారాల్లో సినిమా విడుదల ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో దూకుడు పెంచారు.

అపర్ణ బాలమురుగన్, ఎస్‌జె సూర్య, సెల్వరాఘవన్, దుషార విజయన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. మొదటి 2 పాటలు సూపర్‌హిట్ అయ్యాయి.

జూలై 26న రాయన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి తెలుగు వెర్షన్‌ను గ్రాండ్ గా విడుదల చేయనుంది. సందీప్ కిషన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాడు.

First Published:  10 July 2024 5:16 PM GMT
Next Story