Telugu Global
Cinema & Entertainment

Kubera | కుబేర షూటింగ్ అప్ డేట్స్

Kubera Movie - ధనుష్ హీరోగా నటిస్తున్న సినిమా కుబేర. ఈ సినిమా షూటింగ్ అప్ డేట్స్ చెక్ చేద్దాం..

Kubera | కుబేర షూటింగ్ అప్ డేట్స్
X

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా, నేషనల్ అవార్డు విన్నర్, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న సోషల్ డ్రామా ‘కుబేర’. మైథలాజికల్ పాన్ ఇండియన్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కుబేర కొత్త షెడ్యూల్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్నాడు ధనుష్. ఈ షెడ్యూల్ లో ధనుష్-నాగ్ పై కొన్ని కీలక సన్నివేశాలు తీయబోతున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఈ చిత్రంలో ధనుష్, నాగార్జున, రష్మిక, జిమ్ సర్భ్‌తో పాటు భారీ తారాగణం నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఏకకాలంలో తమిళం, తెలుగు, హిందీ భాషల్లో చిత్రీకరిస్తున్నారు.

రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్‌లను అందించిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ప్రతిష్టాత్మకంగా 'కుబేర' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ధనుష్, నాగార్జునలను లీడ్ పాత్రలకు ఎంపిక చేయడం ఈ చిత్రానికి మొదటి విజయం. తెలుగు, తమిళ భాషల్లో సమాంతరంగా తెరకెక్కుతోంది కుబేర సినిమా.

First Published:  21 Jun 2024 11:45 AM GMT
Next Story