Telugu Global
Cinema & Entertainment

Kubera | ముంబయిలో కుబేరుడు

Dhanush's Kubera - ధనుష్ హీరోగా నటిస్తున్న తెలుగు సినిమా కుబేర. ఈ సినిమా షూటింగ్ అప్ డేట్స్ చెక్ చేద్దాం

Kubera | ముంబయిలో కుబేరుడు
X

గత నెలలో ఫస్ట్‌లుక్‌ విడుదలైన తర్వాత 'కుబేర'పై అంచనాలు పెరిగాయి. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ ఫస్ట్ లుక్‌లో ఊహించని గెటప్ లో కనిపించాడు. ఇక కింగ్ నాగార్జున క్లాస్ అవతార్‌లో కనిపిస్తున్న లుక్ కూడా రిలీజ్ చేశారు. బ్యాంకాక్ షెడ్యూల్ నుంచి ఈ లుక్ విడుదలైంది. వర్కింగ్ స్టిల్స్‌లో నాగ్ లుక్ రివీల్ కానప్పటికీ, అతడ్ని స్టైలిష్ లుక్‌లో చూసి అభిమానులు ఫిదా అయ్యారు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తోంది 'కుబేర'. ధనుష్, నాగార్జునలను లీడ్ పాత్రలకు ఎంపిక చేయడం ఈ చిత్రానికి మొదటి విజయం. అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ (ఏషియన్ గ్రూప్) బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్రంలో ధనుష్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ ముంబైలో జరుగుతోంది. 12 రోజుల పాటు నగరంలోని వివిధ ప్రదేశాలలో షూట్ చేస్తారు. సినిమాకు సంబంధించి దీన్ని కీలకమైన షెడ్యూల్ గా చెబుతున్నారు.

ఈ షెడ్యూల్ లో ధనుష్, రష్మిక, ఇతర నటీనటులపై టాకీ పార్ట్ తీస్తున్నారు. దీంతో పాటు, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌ కూడా తీస్తారు. టీమ్ విడుదల చేసిన వర్కింగ్ స్టిల్‌లో ధనుష్ వాటర్ పైప్‌లైన్ పైన నిలబడి ఉన్నట్లు చూడొచ్చు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.




First Published:  25 April 2024 7:18 PM IST
Next Story