Dhanush | ధనుష్ కు ఇష్టమైన టాలీవుడ్ హీరో
Dhanush Pawan Kalyan - తనకు టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ అంటే చాలా ఇష్టమని ప్రకటించాడు హీరో ధనుష్.

హీరోహీరోయిన్లను ఫేవరెట్ ఆర్టిస్టుల పేర్లు చెప్పమంటే స్కిప్ చేస్తారు. ఒకరి పేరు చెబితే మరో హీరో ఫ్యాన్స్ కు కోపం. అందుకే అందరూ ఇష్టమేనని చెబుతారు, అంతా తన ఫ్రెండ్స్ అని అబద్ధం ఆడతారు. కానీ హీరో ధనుష్ మాత్రం ఈ విషయంలో చాలా క్లియర్ గా ఉన్నాడు.
టాలీవుడ్ కు ధనుష్ కు ఇష్టమైన హీరో ఎవరు తెలుసా? పవన్ కల్యాణ్. అవును.. పవర్ స్టార్ అంటే తనకు చాలా ఇష్టమని ప్రకటించాడు ధనుష్. మిగతా హీరోల ఫ్యాన్స్ ఫీలైనా ఇది నిజం అంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు. అంతేకాదు, ఇతర హీరోల ఫ్యాన్స్ తనను ద్వేషించుకోవద్దంటూ కోరాడు కూడా.
ప్రస్తుతం నాగార్జునతో కలిసి కుబేర అనే సినిమా చేస్తున్నాడు ధనుష్. కాబట్టి నాగ్ పేరు చెబుతాడని అంతా అనుకున్నారు. కానీ ధనుష్ మాత్రం తన మనసులో మాట చెప్పాడు. పవన్ అంటే తనకు ఇష్టమన్నాడు.
అతడు నటించిన రాయన్ సినిమా ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా విడుదలకానుంది. ధనుష్ కు ఇది 50వ సినిమా. అంతేకాదు, ఈ సినిమాకు దర్శకుడు కూడా ఇతడే.