Telugu Global
Cinema & Entertainment

Waltair Veerayya: ఆ బూర గోవాలో కొన్నాడంట

Waltair Veerayya Movie: పూనకాలు లోడింగ్ పాటపై ప్రత్యేకంగా స్పందించాడు దేవిశ్రీ ప్రసాద్. ఆ పాట వెనక గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టాడు.

Waltair Veerayya: ఆ బూర గోవాలో కొన్నాడంట
X

వాల్తేరు వీరయ్య నుంచి తాజాగా రిలీజైన సాంగ్ పూనకాలు లోడింగ్. చిరంజీవి-రవితేజ కలిసి డాన్స్ చేసిన సాంగ్ ఇది. ఈ పాటను డిఫరెంట్ గా కంపోజ్ చేశాడు దేవిశ్రీ ప్రసాద్. మరీ ముఖ్యంగా ఓ సౌండింగ్ కోసం చిన్న పిల్లలు ఆడుకునే ఓ ఆటబొమ్మను ఉపయోగించాడు. ఆ పీపాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు దేవిశ్రీ.

"నేను ఏ ప్రాంతం, ఏ దేశం వెళ్లినా అక్కడ ఏదో ఒక వాయిదాన్ని కొంటాను. ఓసారి ఇలానే గోవా వెళ్లాను. అక్కడ సంగీత పరికరాలు అమ్మే షాపులోకి వెళ్లాను. కానీ ఆ పక్కనే ఉన్న చిన్న పిల్లల బొమ్మల దుకాణం నన్ను ఆకర్షించింది. అందులోకి వెళ్తే, ఈ పీప నాకు కనిపించింది. ఆకుపచ్చ రంగంలో ఉన్న ఆ గొట్టం ఎందుకో నాకు నచ్చింది, వెంటనే 250 రూపాయలిచ్చి ఆ బూర కొన్నాను. అది పూనకాలు లోడింగ్ పాటకు ఉపయోగపడింది."

ఇలా ఆ సంగీత పరికరం వెనక ఫన్నీ స్టోరీని బయటపెట్టాడు దేవిశ్రీ. అందరూ అనుకుంటున్నట్టు అదేదో కొత్త వాయిద్యం కాదని, తిరనాళ్లలో చిన్నపిల్లలు ఆడుకునే ఆటవస్తువని వెల్లడించాడు.

ఆ గొట్టంపై 250 రూపాయల స్టిక్కర్ కూడా ఉందని, జ్ఞాపకంగా ఉంటుందని, తను ఆ స్టిక్కర్ ను కూడా తీయలేదని వెల్లడించాడు దేవిశ్రీ. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ఆ గొట్టాన్ని మరోసారి ఊదుతానని కూడా వెల్లడించాడు ఈ సంగీత దర్శకుడు.

First Published:  4 Jan 2023 12:15 PM IST
Next Story