Telugu Global
Cinema & Entertainment

దేవర ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

భారీ అంచనాలతో రిలీజ్ అయిన దేవర ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లు సంపాదించినట్లు సమాచారం అందుతోంది. తొలి రోజే అదిరిపోయే కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

దేవర ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ నిన్న విడుదల అయిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో రిలీజ్ అయిన దేవర పస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లు సంపాదించినట్లు సమాచారం అందుతోంది. తొలి రోజే అదిరిపోయే కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోో రూ. 80 కోట్ల వరకు వసూళ్లు రాబట్టినట్లు టాక్. హిందీలో రూ. 7 కోట్లు వసూలు చేసిందని తెలుస్తోంది. మిగిలిన అన్ని భాషల్లో… ఓవర్సీస్ లో కలిపి… 140 కోట్లకు పైగా రాబట్టినట్టు సమాచారం. ఇలాగే ఒక వారం రోజులపాటు నడిస్తే… సినిమా లాభాల బాట పట్టడం ఖాయం. ప్రస్తుతం పెద్ద మూవీస్ ఏమీ లేవు కాబట్టి… కచ్చితంగా దేవర మంచి కలెక్షన్లను రాబడుతుంది.

అలాగే, తెలంగాణలో 12.88 కోట్ల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఇదిలా ఉంటే, ప్రభాస్, దీపికా పదుకొణె నటించిన కల్కి 2898 ఏడీ తర్వాత వరల్డ్ వైస్‌గా బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను సాధించిన రెండవ భారతీయ చిత్రంగా దేవర అవతరించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయనం చేసిన దేవర పార్ట్ 1లో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా చేశాడు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఆచార్య తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమా ఇది.

First Published:  28 Sept 2024 3:12 AM GMT
Next Story