దీపిక - రణ్ వీర్ విడాకులు తీసుకుంటున్నారా? క్లారిటీ ఇచ్చిన దీపిక
వీరిద్దరూ త్వరలో విడాకులు కూడా తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇటువంటి ప్రచారం జరగబట్టి కొన్ని నెలలు దాటినప్పటికీ అటు రణ్ వీర్ సింగ్ కానీ ఇటు దీపిక కానీ ఈ వార్తలను ఖండించలేదు.
సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు జంటలు ఇటీవల కాలంలో విడిపోవడం అధికమైంది. టాలీవుడ్ లో కొన్ని నెలల కిందట నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోగా.. కోలీవుడ్ లో ధనుష్- సౌందర్య దంపతులు కూడా విడాకులు తీసుకున్నారు. మరో తమిళ హీరో విజయ్ ఆంటోనీ కూడా తన భార్య ఫాతిమాతో విడిపోనున్నట్లు ఇటీవల వార్తలు వస్తున్నాయి. కాగా బాలీవుడ్ క్రేజీ కపుల్ రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొనే విడిపోతున్నట్లు కొద్దిరోజులుగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది.
రణ్ వీర్, దీపిక ఆరేళ్లపాటు ప్రేమించుకుని ఆ తర్వాత 2018 నవంబర్ లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే వీరిద్దరి మధ్య ఇటీవల కాలంలో విభేదాలు వచ్చాయని..ఒకరంటే మరొకరికి పడటం లేదని తరచూ వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ త్వరలో విడాకులు కూడా తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇటువంటి ప్రచారం జరగబట్టి కొన్ని నెలలు దాటినప్పటికీ అటు రణ్ వీర్ సింగ్ కానీ ఇటు దీపిక కానీ ఈ వార్తలను ఖండించలేదు. దీంతో వారిద్దరూ విడిపోవడం నిజమేమోనని చాలామంది భావించారు.
అయితే తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని, తాము విడిపోవడం లేదని తాజాగా దీపిక పదుకొనే పరోక్షంగా వెల్లడించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 'రణ్ వీర్ వారం రోజులుగా మ్యూజిక్ ఫెస్టివల్ లో పాల్గొంటున్నాడు. అతడి రాక కోసం ఎదురుచూస్తున్నా. అతడు ఇంటికి వచ్చి తనను చూడగానే తప్పకుండా సంతోషిస్తాడు.' అని ఆమె పేర్కొంది. రణ్ వీర్ కు తనపై ప్రేమ తగ్గలేదని, తాను కూడా రణ్ వీర్ ను అంతే ప్రేమిస్తున్నట్లు ఈ కామెంట్స్ ద్వారా దీపికా పరోక్షంగా తెలిపింది. దీంతో కొద్దిరోజులుగా రణ్ వీర్- దీపిక దంపతులు విడిపోతున్నారని వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.