Telugu Global
Cinema & Entertainment

Dear Comrade | మళ్లీ వార్తల్లోకెక్కిన డియర్ కామ్రేడ్

Dear Comrade Youtube - విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమా యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. అదేంటో మీరూ చూడండి.

Dear Comrade | మళ్లీ వార్తల్లోకెక్కిన డియర్ కామ్రేడ్
X

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డిజాస్టర్ సినిమా డియర్ కామ్రేడ్. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. భారీ రన్ టైమ్, ఆకట్టుకోని ఎమోషన్స్ ఈ సినిమాను ఫ్లాప్ చేశాయి. ఈ సినిమా దెబ్బతో విజయ్ దేవరకొండ కుదేలైపోయాడు. బాగా డీలా పడిపోయాడు. ఒక దశలో సినిమా ఫ్లాప్ ను అంగీకరించాడు కూడా. అలా బాగా వార్తల్లో నలిగిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి తెరపైకొచ్చింది.

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్ సినిమా హిందీ వెర్షన్ యూట్యూబ్ లో రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా 400 మిలియన్స్ కు పైగా వ్యూస్ తో దూసుకెళ్తోంది. గోల్డ్ మైన్స్ యూట్యూబ్ ఛానెల్ 2020, జనవరి 19న డియర్ కామ్రేడ్ మూవీ హిందీ వెర్షన్ ను అప్ లోడ్ చేసింది. ఈ సినిమా 150 భాషల్లో సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉండటం విశేషం.

ఈ సినిమాకు యూట్యూబ్ లో వస్తున్న వ్యూస్ పాన్ ఇండియా స్థాయిలో విజయ్ దేవరకొండ సినిమాలకు దక్కుతున్న ఆదరణను, హీరోగా విజయ్ క్రేజ్ ను చూపిస్తున్నాయి. బిగ్ బెన్ సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా డియర్ కామ్రేడ్ సినిమాను రూపొందించాయి.

భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రశ్మిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో పాటలు చాలా బాగుంటాయి. సినిమా మాత్రం ఫ్లాప్. యూట్యూబ్ లో మాత్రం సూపర్ హిట్టయింది.

First Published:  16 Jun 2024 6:32 AM GMT
Next Story