Das Ka Dhamki - 10 రెట్లు క్రేజీగా ధమ్కీ పార్ట్-2
Das Ka Dhamki part 2 - దాస్ కా ధమ్కీ పార్ట్-2 పై స్పందించాడు విశ్వక్ సేన్. పార్ట్-1తో పోలిస్తే 10 రెట్లు క్రేజీగా ఉంటుందంటున్నాడు
విశ్వక్ సేన్ తాజా చిత్రం దాస్ కా ధమ్కీ. థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సక్సెస్ అనిపించుకుంది. పెట్టిన పెట్టుబడిని వెనక్కు రాబట్టింది. ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా సీక్వెల్ పై స్పందించాడు హీరో విశ్వక్ సేన్.
"దాస్ కా ధమ్కీ పార్ట్-2 కచ్చితంగా వస్తుంది. పార్ట్-2లో ప్రాపర్ సీక్వెల్. ఫ్రెష్ సబ్జెక్ట్ కాదు. సీక్వెల్ లో కూడా నివేత పెతురాజ్ హీరోయిన్ గా ఉంటుంది. పార్ట్-1 కంటే 10 రెట్లు క్రేజీగా ఉంటుంది పార్ట్-2 మూవీ. అయితే ఇప్పట్లో ఇది స్టార్ట్ చేయలేను. నేను దర్శకత్వం చేయడం కోసం నా నిర్మాతలందర్నీ ఏడాది వెయిట్ చేయించాను. ముందుగా ఆ కమిట్ మెంట్స్ పూర్తిచేయాలి. అవి పూర్తయిన తర్వాత ధమ్కీ-2 వస్తుంది."
ఈ ఏడాది డిసెంబర్ లోపు 3 సినిమాలు పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు విశ్వక్ సేన్. ఇవన్నీ ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలు. వీటిలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రాబోతున్న గామి అనే సినిమా కూడా ఉంది. ఈ సినిమాలన్నీ కంప్లీట్ చేసి, వచ్చే ఏడాది మార్చి నుంచి ధమ్కీ-2 ప్రొడక్షన్ పై వర్క్ చేస్తానంటున్నాడు విశ్వక్.
తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లలో కంటే ఓటీటీలో ఇది మరింత హిట్టయింది. దీనిపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాడు విశ్వక్.