Telugu Global
Cinema & Entertainment

Darling movie | పాటలతో మొదలైన డార్లింగ్ ప్రయాణం

Darling movie - ప్రియదర్శి-నభా నటేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా డార్లింగ్. ఈ సినిమా పాటల ప్రచారం మొదలైంది.

Darling movie | పాటలతో మొదలైన డార్లింగ్ ప్రయాణం
X

పాన్ ఇండియా సెన్సేషన్ హను-మాన్ తర్వాత కె నిరంజన్ రెడ్డి చేస్తున్న సినిమా డర్లింగ్. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియదర్శి, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ కు అశ్విన్ రామ్ దర్శకుడు.

మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్‌లను స్టార్ట్ చేశారు. సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు. దీనికి ఫ్రస్ట్రేషన్ ఆంథమ్ అని పేరు పెట్టారు. వివేక్ సాగర్ కంపోజ్ చేసిన ఈ పాటను.. హనుమాన్ సిహెచ్‌తో కలిసి రామ్ మిరియాల పాడాడు.

ఈ పాట ఓ కామన్ మ్యాన్ ఫ్రస్ట్రేషన్ ను ప్రజెంట్ చేస్తోంది. అతని చుట్టూ ఉన్న వ్యక్తులు లైఫ్ లో చిల్‌ అవ్వమని చెబుతుంటారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం సరదాగా ఉంది. ఫ్రస్ట్రేషన్ ఆంథమ్ గా ప్రమోట్ చేస్తున్న ఈ పాటలో ప్రియదర్శి తన డ్యాన్స్ స్కిల్స్ చూపించాడు.

బ్రహ్మానందం, విష్ణు, కృష్ణతేజ్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు.

First Published:  19 Jun 2024 7:25 AM GMT
Next Story