Telugu Global
Cinema & Entertainment

Daggubati Abhiram | ఓ ఇంటివాడైన దగ్గుబాటి అభిరామ్

Daggubati Abhiram - రామానాయుడు మనవడు, సురేష్ బాబు రెండో కొడుకు, రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ పెళ్లి చేసుకున్నాడు. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి.

Daggubati Abhiram | ఓ ఇంటివాడైన దగ్గుబాటి అభిరామ్
X

హీరో దగ్గుబాటి అభిరామ్ వివాహం ఘనంగా జరిగింది. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లితో దగ్గుబాటి అభిరామ్ అధికారికంగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహం కావడం విశేషం.

తనకు వరుసగా మరదలు అయ్యే ప్రత్యూషతో అభిరామ్ వివాహం జరిగింది. పెళ్లికూతురిది ఆంధ్రప్రదేశ్. డెస్టినేషన్ వెడ్డింగ్ లో భాగంగా వీళ్ల వివాహం శ్రీలంకలో జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన వ్యక్తులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. ఎలాంటి లీకులు లేకుండా సింపుల్ గా రెండో కొడుకు పెళ్లి చేశారు సురేష్ బాబు.

సురేష్ బాబు పెద్ద కొడుకు రానా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కరోనా టైమ్ లో అతడి వివాహం సింపుల్ గా జరిగిపోయింది. దీంతో రెండో కొడుకు పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలని సురేష్ బాబు నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టుగానే తనే దగ్గరుండి సంబంధం చూసి, శ్రీలంకలో గ్రాండ్ గా వివాహం జరిపించారు. రేపోమాపో హైదరాబాద్ లో సినీ, రాజకీయ ప్రముఖులకు రిసెప్షన్ ఏర్పాటుచేస్తున్నారు.

అహింస సినిమాతో హీరోగా మారాడు దగ్గుబాటి అభిరామ్. అయితే ఆ సినిమా అతడికి కలిసి రాలేదు. దీంతో రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టాడు. ఓవైపు వ్యాపారం చేస్తూనే, మరోవైపు రెండో సినిమా ఆలోచనల్లో ఉన్నాడు ఈ హీరో. ఇంతలోనే ఇలా పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయ్యాడు.

First Published:  8 Dec 2023 9:32 PM IST
Next Story