Telugu Global
Cinema & Entertainment

Saripodhaa Sanivaaram | ఒకేసారి పలు ఫస్ట్ లుక్కులు

Saripodhaa Sanivaaram - హీరోహీరోయిన్ లుక్స్ ఇప్పటికే రిలీజయ్యాయి. మిగతా కీలక పాత్రల లుక్స్ ను ఒకేసారి విడుదల చేశారు.

Saripodhaa Sanivaaram | ఒకేసారి పలు ఫస్ట్ లుక్కులు
X

నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ, డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’ నుంచి కీలకమైన క్యారెక్టర్స్ ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు.

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్, సినిమా నుండి వచ్చే ప్రతి అప్‌డేట్ భారీ బజ్ ని క్రియేట్ చేస్తున్నాయి. రీసెంట్ గా రిలీజైన 'నాట్ ఏ టీజర్' వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ రోజు మేకర్స్ సినిమాలోని కీలక పాత్రల ఫస్ట్ లుక్స్ ని రిలీజ్ చేశారు. భద్ర గా అదితిబాలన్, గోవర్ధన్ గా అజయ్, కూర్మానంద్ గా మురళీ శర్మ, నారాయణ ప్రభ గా అజయ్ ఘోష్, కాళి, మార్టిన్ క్యారెక్టర్స్ ని పరిచయం చేశారు.

అలాగే ఈ మూవీ లో సోకులపాలెం అనే ఊరు చాలా కీలకం. సోకులపాలెం వరల్డ్ ని పరిచయం చేస్తూ ఒక స్పెషల్ పోస్టర్ రివీల్ చేశారు. ఈ పోస్టర్స్ అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ చిత్తాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్నారు. జేక్స్ బిజాయ్ సంగీతం అందిస్తున్నాడు. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది.

First Published:  27 July 2024 2:53 PM GMT
Next Story