Telugu Global
Cinema & Entertainment

కంగ్రాట్స్‌ మై డియరెస్ట్‌ హజ్బెండ్‌!

చెర్రీకి ఉపాసన శుభాకంక్షలు.. లవ్‌ యూ అంటూ ట్వీట్‌

కంగ్రాట్స్‌ మై డియరెస్ట్‌ హజ్బెండ్‌!
X

గేమ్‌ చేంజర్‌ రిలీజ్‌ సందర్భంగా చెర్రీకి ఆయన సతీమణి ఉపాసన 'ఎక్స్‌' వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ''కంగ్రాట్స్‌ మై డియరెస్ట్‌ హజ్బండ్‌.. యువర్‌ ట్రూలీ ఆర్‌ ఏ గేమ్‌ చేంజర్‌ ఇన్‌ ఎవ్రీ వే.. లవ్‌ యూ'' అని ట్వీట్‌ చేశారు. హార్ట్‌ సింబల్‌ ఏమోజీలను జత చేశారు. రామ్‌ చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందించిన గేమ్‌ చేంజర్‌ మూవీ శుక్రవారం రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమాపై పలు వెబ్‌సైట్లలో రాసిన రివ్యూలను తన పోస్ట్‌లో ఉపాసన షేర్‌ చేశారు. దిల్‌ రాజు నిర్మించిన ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్‌, ఎస్‌జే సూర్య, సునీల్‌ తదితరులు నటించారు. టెక్నికల్‌ రీజన్స్‌ తో సినిమా నుంచి నానా హైరానా పాటను తొలగించామని.. సంక్రాంతి సందర్భంగా ఈనెల 14న ఈ పాటను సినిమాకు జత చేస్తామని మూవీ టీమ్‌ వెల్లడించింది.

First Published:  10 Jan 2025 8:55 PM IST
Next Story