Telugu Global
Cinema & Entertainment

Committee Kurrollu | నితిన్ రిలీజ్ చేసిన టీజర్ ఎలా ఉందంటే..?

Committee Kurrollu - నిహారిక నిర్మాతగా మారి తీసిన సినిమా కమిటీ కుర్రోళ్లు. ఈ సినిమా టీజర్ రిలీజైంది.

Committee Kurrollu | నితిన్ రిలీజ్ చేసిన టీజర్ ఎలా ఉందంటే..?
X

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతోన్న సినిమా కమిటీ కుర్రోళ్లు. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. ప‌క్కా ప్లానింగ్‌తో మేక‌ర్స్ అనుకున్న స‌మ‌యానికి క‌న్నా ముందే సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉంది.

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ‘కమిటీ కుర్రోళ్ళు’ టీజర్‌ విడుదల చేసింది. హీరో నితిన్ సోషల్ మీడియా వేదికగా టీజర్‌ను విడుదల చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపాడు.

టీజర్‌ను గమనిస్తే కొంత మంది యువకులు వారి బాల్యాన్ని తలుచుకుంటే అప్పట్లో ఆటలు ఆడుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరదాగా గడిపిన రోజులను గుర్తుకు తెచ్చుకుంటారు. చిన్నతనంలో వాళ్లందరూ కలిసి ఓ ఇడ్లీ అంగల్లో ఇడ్లీలు తినటం, పంపు సెట్టు దగ్గర సరదాగా స్నానాలు చేయటం వంటి సన్నివేశాలను మనం చూడొచ్చు. అలాగే టీనేజ్‌లో మనసుకు నచ్చిన అమ్మాయిలను ప్రేమించటం, ఆ సందర్బంలో జరిగిన కామెడీని వారు గుర్తుకు తెచ్చుకోవటం వంటి సన్నివేశాలను కూడా టీజర్లో గమనించవచ్చు.

టీజర్‌లో ఊర్లో జరిగే గొడవలను కూడా చూపించారు. సరదాగా ఉండాల్సిన యువత ఊళ్లో గొడవల్లో ఎందుకు తలదూర్చుతారు.. ఆ గొడవల కారణంగా వారి జీవితాలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాలంటున్నారు మేకర్స్.

First Published:  14 Jun 2024 5:44 PM GMT
Next Story