వైసీపీకి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ క్షమాపణలు
లైలా సినిమాకు మద్దతునివ్వాలని వేడుకోలు
![వైసీపీకి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ క్షమాపణలు వైసీపీకి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ క్షమాపణలు](https://www.teluguglobal.com/h-upload/2025/02/13/1403153-prithvi.webp)
వైసీపీకి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ బహిరంగ క్షమాపణ చెప్పారు. గురువారం ఈమేరకు వీడియో రిలీజ్ చేశారు. ఇటీవల జరిగిన లైలా మూవీ ఈవెంట్ లో పృథ్వీ మాట్లాడుతూ 150 మేకల్లో 11 మేకలు మాత్రమే మిగిలాయి అని వైసీపీ టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. దీంతో ఆగ్రహించిన జగన్ అభిమానులు, వైసీపీ శ్రేణులు బయ్‌కాట్ లైలా మూవీ అని సోషల్ మీడియాలో భారీ క్యాంపెయినింగ్ నిర్వహించాయి. దీంతో హీరో విశ్వక్‌సేన్ రంగంలోకి దిగి బహిరంగ క్షమాపణలు చెప్పారు. అయినా వైసీపీ శ్రేణులు వెనక్కి తగ్గలేదు. పృథ్వీకి ఫోన్ చేసి ఆయన కామెంట్స్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో తనకు బీపీ పెరిగిందని చెప్తూ పృథ్వీ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. అయినా వెనక్కి తగ్గకుండా వైసీపీపై మళ్లీ కామెంట్స్ చేశారు. దీంతో లైలా మూవీ ఎలా ఆడుతుందో చూస్తామని వైసీపీ శ్రేణులు హెచ్చరించాయి. తన కామెంట్లతో సినిమాకు భారీ నష్టం వాటిల్లుతుందని గుర్తించిన పృథ్వీ వీడియో రిలీజ్ చేశారు. తన కామెంట్స్‌తో ఎవరి మనోభావాలు అయినా దెబ్బతింటే వాళ్లందరికీ క్షమాపణలు చెప్తున్నానని పేర్కొన్నారు. లైలా మూవీకి మద్దతునివ్వాలని వేడుకున్నారు. విశ్వక్‌సేన్ డ్యూయల్ రోల్ పోషించిన లైలా మూవీ వాలంటైన్స్ డే సందర్భంగా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా స్క్రీన్‌లలో రిలీజ్ అవుతోంది.