చోటా కే నాయుడు, హరీష్ శంకర్ వివాదం.. వెనుక కారణం ఇదేనా!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో వివాదం రాజుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడుకు మాస్ వార్నింగ్ ఇస్తూ.. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పదేళ్ల కిందట ఎన్టీఆర్ హీరోగా వచ్చిన రామయ్య, వస్తావయ్య సినిమాతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు లేఖ ద్వారా స్పష్టం అవుతోంది.
హరీష్‌శంకర్ లేఖలో ఏముందంటే...
" రామయ్య వస్తావయ్యా సినిమా వచ్చి పదేళ్లు అయింది. ఈ పదేళ్లలో మీరు 10 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటే.. నేను 100 ఇంటర్వ్యూలు ఇచ్చా. కానీ ఏరోజూ నేను మీ గురించి తప్పుగా మాట్లాడలేదు. కామీ మీరు పదేపదే నా గురించి అవమానకరంగా మాట్లాడారు. యాంకర్ అడగకున్నా నా ప్రస్తావన తీసి మరి నన్ను అవమానించారు.
రామయ్య వస్తావయ్య సినిమా అపుడే మిమ్మల్ని తీసేసి.. వేరే కెమెరామెన్‌ను పెట్టాలనే
ప్రస్తావన వచ్చింది. కానీ నేను మిమ్మల్ని తీసేయలేదు. దిల్‌రాజు చెప్పాడనో, గబ్బర్ సింగ్ తర్వాత నాకు పొగరు ఎక్కువైంది అంటారనో మిమ్మల్ని తీసేయలేదు. కానీ ఏరోజూ మీపై నేను నింద వేయలేదు. అదీ నా క్యారెక్టర్. దీన్ని ఇక్కడితో వదిలేస్తే నీకే మంచిది. కాదు, కూడదు అని గెలుక్కుంటే.. ఏరోజైనా, ప్లేస్ ఏదైనా నేను" అంటూ చోటాకే నాయుడుకు మాస్ వార్నింగ్ ఇచ్చారు హరీష్‌శంకర్.
హరీష్‌శంకర్ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలామంది దీనిపై స్పందిస్తున్నారు. హరీష్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. హరీష్‌శంకర్ కూడా వాళ్లకు రిప్లే ఇస్తున్నాడు. నా ఆవేదన అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అని బదులిస్తున్నాడు. అయితే
హరీష్ లెటర్‌పై చోటా కే నాయుడు ఎలా రెస్పాండ్ అవుతాడు. వివాదం ఎక్కడి వరకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది.