Waltair Veerayya: ఓవర్సీస్ లో వీరయ్య వీరంగం
Chiranjeevi's Waltair Veerayya: చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. ఓవర్సీస్ లో ఈ సినిమా పెద్ద హిట్టయింది.

Waltair Veerayya Movie Collections: వాల్తేరు వీరయ్య మొదటి వారం వసూళ్లు
ఓవర్సీస్ లో వాల్తేరు వీరయ్య దూసుకుపోతున్నాడు. ఊహించని విధంగా వసూళ్ల వర్షం కురిపిస్తున్నాడు. గాడ్ ఫాదర్, ఆచార్య సినిమాలతో ఓవర్సీస్ లో చిరంజీవికి మార్కెట్ తగ్గిందనే కథనాల్ని, అంచనాల్ని తలకిందులు చేశారు మెగాస్టార్. కళ్లముందు కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నారు.
హిట్టయిన సినిమాకు మిలియన్ డాలర్ రావడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో, వాల్తేరు వీరయ్య సినిమా సునాయాసంగా 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరిపోయింది. తాజాగా ఈ సినిమా వసూళ్లు 2.2 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. మరికొన్ని రోజుల్లో 2.5 మిలియన్ డాలర్ల మార్క్ కు సినిమా చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ సినిమా ఫైనల్ రన్ పూర్తయ్యేసరికి, ఓవర్సీస్ టాప్-10 జాబితాలో స్థానాలు మారడం ఖాయంగా కనిపిస్తోంది. లిస్ట్ లో ఉన్న కొన్ని సినిమాల్ని వాల్తేరు వీరయ్య వెనక్కి నెట్టడం గ్యారెంటీ. తన లైఫ్ టైమ్ వసూళ్లతో ఈ సినిమా ఓవర్సీస్ టాప్-10లో ఏ స్థానంలో నిలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయిన ఈ సినిమా, బయ్యర్లకు ఓవర్ ఫ్లోస్ అందిస్తోంది. నైజాం, సీడెడ్, ఆంధ్రా అనే తేడాలేకుండా అన్ని సెంటర్లలో వీరయ్య వీరంగం చూపిస్తున్నాడు.