Waltair Veerayya Trailer review: వాల్తేరు వీరయ్య ట్రయిలర్ రివ్యూ
Waltair Veerayya Movie Trailer review: చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య ట్రయిలర్ వచ్చేసింది. అదెలా ఉందో చూద్దాం రండి.

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మూవీ వాల్తేరు వీరయ్య, రవితేజ యాక్షన్-ప్యాక్డ్ రోల్‌లో నటించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ తాజాగా రిలీజైంది. ప్రమాదకరమైన స్మగ్లర్, ఓ అంతర్జాతీయ నేరస్థుడిని పట్టుకుంటుంది RAW డిపార్ట్ మెంట్. అతడ్ని రాక్షసుడిగా ఎలివేట్ చేస్తారు. అలా పడవ నడిపే సీన్ తో వాల్తేరు వీరయ్యగా స్టైల్‌గా తెరపైకొచ్చారు చిరంజీవి.
ట్రయిలర్ లో డైలాగ్స్ అన్నీ బాగున్నాయి. "మాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరెట్టిందే ఆయన్ను చూసి" అనే డైలాగ్ మరింత బాగుంది. మలేషియాలో శృతిహాసన్ ను కలవడం, కామెడీ బ్యాచ్ తో కలిసి కామెడీ పండించడం లాంటి సన్నివేశాలు వింటేజ్ చిరంజీవిని గుర్తుచేస్తున్నాయి.
ఇక రవితేజ ఎంట్రీతో వాల్తేరు వీరయ్య ట్రయిలర్ నెక్ట్స్ లెవెల్ కు చేరుకుంది. ట్రయిలర్ చివర్లో ఇడియట్ సినిమా స్పూఫ్ ను చూపించారు. చిరంజీవి, రవితేజ మధ్య డైలాగ్స్ బాగున్నాయి.
ఆర్థర్ విల్సన్ సినిమాటోగ్రఫీ, నిరంజన్ ఎడిటింగ్ బాగున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. వీరయ్య బిల్డ్-అప్ సన్నివేశాలను తన బీజీఎంతో మరో స్థాయికి తీసుకెళ్లాడు. మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ మేకింగ్ విజువల్స్‌లో కనిపిస్తోంది. సంక్రాంతి కానుకగా 13న థియేటర్లలోకి వస్తున్నాడు వీరయ్య.