Telugu Global
Cinema & Entertainment

Indra Movie | ఇంద్ర రీ-రిలీజ్

Indra Movie - మరో బ్లాక్ బస్టర్ సినిమా రీ-రిలీజ్ కు రెడీ అయింది. చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా మరోసారి వస్తోంది.

Indra Movie | ఇంద్ర రీ-రిలీజ్
X

మెగాస్టార్ చిరంజీవి ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్ మూవీ ఇంద్ర. ఈ సినిమా రీ-రిలీజ్ కు రెడీ అయింది. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. బి. గోపాల్ డైరక్ట్ చేసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మించారు.

జూలై 2002లో విడుదలైన ఇంద్ర బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అప్పట్లోనే 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆ టైమ్ లో ఈ వసూళ్లు టాలీవుడ్ లోనే కాదు, టోటల్ సౌత్ లోనే అత్యథికం. ఆర్తి అగర్వాల్, సోనాలీ బింద్రే హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో శివాజీ కీలక పాత్ర పోషించాడు.

తెలుగులో సూపర్ హిట్టయిన తర్వాత తమిళంలోకి ఇందిరన్ పేరిట, హిందీలోకి ఇంద్ర: ది టైగర్ పేరిట డబ్ అయింది ఈ సినిమా. టీవీల్లో డబ్ చేసిన హిందీ వెర్షన్‌లో అత్యధికంగా వీక్షించిన దక్షిణ భారత సినిమాల్లో ఇంద్ర కూడా ఒకటి.

ఆగస్ట్ 22న ఇంద్ర సినిమాని రీ-రిలీజ్ చేయబోతున్నట్టు వైజయంతీ మూవీస్ ప్రకటించింది. నిజానికి ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవి వేసిన వీణ స్టెప్ ఈ సినిమాలోనిదే. ఈ సినిమా విజయోత్సవ సభలో స్వయంగా స్టేజ్ పై చిరంజీవి ఈ స్టెప్ వేసి తన అభిమానుల్ని అలరించారు.

First Published:  25 July 2024 5:00 AM GMT
Next Story