Telugu Global
Cinema & Entertainment

ఆ రెండు నిర్ణయాలు నావే

గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించి 2 కీలక నిర్ణయాల్ని స్వయంగా చిరంజీవి తీసుకున్నారు. ఇంతకీ ఆ రెండు నిర్ణయాలు ఏంటి?

ఆ రెండు నిర్ణయాలు నావే
X

గాడ్ ఫాదర్ సినిమాలో విలన్ గా నటించాడు సత్యదేవ్. ఇక ఈ సినిమాలో చిరంజీవి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపించబోతున్నారు. ఈ రెండు నిర్ణయాలు తనవే అని ప్రకటించుకున్నారు చిరంజీవి. ముందుగా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ సంగతి చూద్దాం.

గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి యూత్ కాదు. జీవితాన్ని కాచివడబోసిన ఓ మధ్యవయష్కుడి పాత్ర అది. అలా కనిపించాలంటే జుట్టు నెరవాల్సిందే. అందుకే తొలిసారిగా చిరంజీవి నెరిసిన జుట్టుతో కనిపించారు. ఈ నిర్ణయం పూర్తిగా తనదేనని ప్రకటించుకున్నారు చిరంజీవి. తన నిర్ణయానికి యూనిట్ నుంచి అందరి మద్దతు ఉందని తెలిపారు.

ఇక విలన్ గా సత్యదేవ్ ను తీసుకున్న నిర్ణయం కూడా తనదేనని అన్నారు చిరు. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం చాలామంది నటుల్ని అనుకున్నామని, సత్యదేవ్ అయితే బాగుంటుందని తనకు అనిపించిందని, అదే విషయాన్ని యూనిట్ లో చెబితే అందరూ ఒప్పుకున్నారని అన్నారు.

ఇలా సినిమాకు సంబంధించి కీలకమైన రెండు అంశాల్లో తనే నిర్ణయం తీసుకున్నానని.. సత్యదేవ్ పెర్ఫార్మెన్స్ తో పాటు, తన సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ అందర్నీ ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు చిరు.

First Published:  26 Sept 2022 8:04 PM IST
Next Story