Telugu Global
Cinema & Entertainment

చిరంజీవితో రీమేక్ అంటే హిట్టే!

రీమేకులు లేకపోతే చిరంజీవి లేరు. ఆయన నటించిన చాలా మెగా హిట్ సినిమాలు రీమేకులే. నేటికీ గాడ్ ఫాదర్ తో 153 సినిమాలు నటిస్తే, వీటిలో 50 కి పైగా రీమేకులే! ప్రస్తుతం నటిస్తున్న భోళాశంకర్ రీమేకే.

చిరంజీవితో రీమేక్ అంటే హిట్టే!
X

మెగా స్టార్ చిరంజీవి నటించిన సినిమాలు చూస్తే ఒకటి అర్ధమవుతుంది. 1978 లో పునాదిరాళ్ళుతో రంగ ప్రవేశం చేసి అయిదేళ్ళలో 1983 లో ఖైదీతో స్టార్ హోదా పొంది, సుప్రీం హీరోగా ఎదిగి, ఇంకో ఐదేళ్ళలో 1988 లో మరణ మృదంగంతో మెగాస్టార్ హోదా సాధించారు. అప్పటి నుంచి నేటివరకూ మెగా స్టార్ గా తన స్థానాన్ని తిరుగులేకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే ఆయన మెగా స్టార్ ఇమేజి పొందడానికి, దాన్ని నిలబెట్టుకోవడానికీ ప్రధాన పాత్ర పోషించిన సినిమాల్లో రీమేకుల స్థానం తక్కువేం కాదు. రీమేకులు లేకపోతే చిరంజీవి లేరు. ఆయన నటించిన చాలా మెగా హిట్ సినిమాలు రీమేకులే. నేటికీ గాడ్ ఫాదర్ తో 153 సినిమాలు నటిస్తే, వీటిలో 50 కి పైగా రీమేకులే! ప్రస్తుతం నటిస్తున్న భోళాశంకర్ రీమేకే. మలయాళంలో మమ్ముట్టితో హిట్టయిన భీష్మపర్వం కూడా ఇక రీమేక్ చేయబోతున్నారు.

ఆయన నటించిన రీమేకులు ఒరిజినల్ కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించాయి. మలయాళంలో లూసిఫర్ 100 కోట్లు వసూలు చేస్తే, గాడ్ ఫాదర్ ఇప్పటికీ 100 కోట్లు దాటింది. తమిళంలో కత్తి 130 కోట్లు వసూలు చేస్తే, ఖైదీ నం 150 - 164 కోట్లు వసూలు చేసింది. ఇలాగే ఘరానా మొగుడు (అనురాగ అరతిల్లు -కన్నడ), పసివాడి ప్రాణం (పుథివు పుథియా పూంథెనల్ - తమిళం), పట్నం వచ్చిన పతివ్రతలు (పట్టణక్క బంధ పత్నియారు -కన్నడ), చట్టానికి కళ్ళు లేవు (సట్ట ఒరు ఇరుత్తారాయ్-తమిళం), హిట్లర్ (హిట్లర్ - మలయాళం), స్నేహం కోసం (నట్సుక్కగా -తమిళం) ...చెప్పుకుంటూ పోతే చాలా వున్నాయి.

ఆయనతో ఫ్లాపయిన రీమేక్ అంటూ లేదు. అలాంటప్పుడు లూసిఫర్ రీమేక్ చేస్తూంటే తెలుగులో వర్కౌట్ కాదని రకరకాల వూహాగానాలు చేశారు. ఇది హిట్టయ్యింది. కనుక చిరంజీవి ఇకముందు రీమేకుల్లో నటిస్తే సందేహాలవసరం లేదని ఆయన రీమేకుల ట్రాకు చూస్తే తెలుస్తుంది. 50 మైగా రీమేకులు నటిస్తే ఒకటి రెండు తప్ప అన్నీ హిట్లే!

మరికొన్ని రీమేకులు చూద్దాం...

ఠాగూర్ (రమణ -తమిళం), అంజి (ఇండియానా జోన్స్ -హాలీవుడ్), మృగరాజు (ది ఘోస్ట్ అండ్ ది డార్క్ నెస్- హాలీవుడ్), శంకర్ దాదా ఎంబిబిఎస్ (మున్నాభాయ్ ఎంబిబిఎస్ -హిందీ), శంకర్ దాదా జిందాబాద్ (లగే రహో మున్నా భాయ్- హిందీ), గూండా రాజ్ (గ్యాంగ్ లీడర్ –తెలుగు), ప్రతిబంధ్ (అంకుశం -తెలుగు), జంటిల్ మాన్ (జంటిల్ మాన్ - తమిళం), ఖైదీ నెం. 786 (అమ్మన్ కోవిల్ కిళాకలే -తమిళం) ఎస్పీ పరశురామ్ (వాల్టర్ నట్రివేల్ -తమిళం), రాజావిక్రమార్క ( మై డియర్ మార్తాండన్ –తమిళం)

త్రినేత్రుడు (జల్వా- హిందీ), ఆరాధన (కవితోరా విథైగల్), దొంగ మొగుడు ( ట్రేడింగ్ ప్లేసెస్- హాలీవుడ్), విజేత (సాహెబ్ -హిందీ), అడవి దొంగ (టార్జాన్ -హిందీ), అభిలాష (ది మాన్ హూ డేర్డ్, యాండ్ రీజనబుల్ డౌట్ -హాలీవుడ్),

చక్రవర్తి (జనవోలి -తమిళం), చిరంజీవి (నానే రాజా- కన్నడ), ఇంటి గుట్టు (పనక్కర కుటుంబం -కన్నడ), బంధాలు అనుబంధాలు(అవళ హెజ్జే- కన్నడ), మంచు పల్లకీ ( పావిలోనా సోలై -తమిళం), ప్రేమ పిచ్చోళ్ళు (షౌకీన్ –హిందీ)

నాగు (తీస్రీ మంజిల్- హిందీ), దేవాంతకుడు (గెలుపు నిన్నదే -కన్నడ ), హీరో (రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్- హాలీవుడ్), (యమ కింకరుడు (మాడ్ మాక్స్, డర్టీ హారీ- హాలీవుడ్), ఖైదీ (ఫస్ట్ బ్లడ్- హాలీవుడ్).

ఇలా వుండగా, 1999లో, చిరంజీవి హాలీవుడ్ మూవీ 'రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్' లో నటించాల్సి వుంది. అనివార్య కారణాల వల్ల అది ముందు కెళ్ళలేదు. ఇది విడుదలై వుంటే 'బ్లడ్‌స్టోన్‌' అనే హాలీవుడ్‌ సినిమాలో నటించిన రజనీకాంత్‌ సరసన చిరంజీవి పేరుండేది.

First Published:  11 Oct 2022 2:35 PM IST
Next Story