Telugu Global
Cinema & Entertainment

హిట్ సినిమాలపై తండ్రికొడుకుల రెస్పాన్స్

రీసెంట్ గా హిట్టయిన రెండు సినిమాలు కార్తికేయ2, సీతారామం. ఈ రెండు సినిమాలపై చిరంజీవి, రామ్ చరణ్ స్పందించారు

హిట్ సినిమాలపై తండ్రికొడుకుల రెస్పాన్స్
X

ఇటు చిరంజీవి, అటు రామ్ చరణ్ ఒకేసారి 2 సినిమాలపై స్పందించారు. చిరంజీవి, సీతారామం సినిమాను మెచ్చుకుంటే.. రామ్ చరణ్ కార్తికేయ2ను ఆకాశానికెత్తేశాడు. ఈ మెగా తండ్రికొడుకుల రియాక్షన్స్ బ్యాక్ టు బ్యాక్ చూద్దాం..

"సీతారామం చూశాను. ఒక చక్కటి ప్రేమకావ్యం చూసిన అనుభూతి.ముఖ్యంగా ఎంతో విభిన్నమైన స్క్రీన్ ప్లే తో ఈ ప్రేమ కథని ఆవిష్కరించిన విధానం ఎంతోగానో నచ్చింది. మనసులపై చెరగని ముద్ర వేసే ఇలాంటి చిత్రాన్ని ఎంతో ఉన్నతమైన నిర్మాణ విలువలతో నిర్మించిన అశ్వినీదత్ గారికి, స్వప్నా దత్, ప్రియాంకా దత్ లకు, ఒక ప్యాషన్ తో చిత్రీకరించిన దర్శకుడు హను రాఘవపూడికి, కలకాలం నిలిచే సంగీతాన్ని అందించిన విశాల్ చంద్రశేఖర్ కి, అన్నిటికన్నా ముఖ్యంగా సీతా-రామ్ లుగా ఆ ప్రేమకథ కి ప్రాణం పోసిన మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ లకు, సూత్రధారి పాత్రని పోషించిన రష్మిక కి మొత్తం టీం అందరికీ నా శుభకాంక్షలు! ప్రేక్షకుల మనసులు దోచిన ఈ చిత్రం మరెన్నో అవార్డులను, రివార్డులను జాతీయ స్థాయిలో గెలవాలని మనస్పూర్తి గా అభిలషిస్తున్నాను."

ఇలా సీతారామం సినిమా సక్సెస్ పై స్పందించారు చిరంజీవి. అటు రామ్ చరణ్ కార్తికేయ-2 సినిమాపై రియాక్ట్ అయ్యాడు. మంచి సినిమాలు ఎప్పుడూ థియేటర్లకు కళ తీసుకొస్తాయని, కార్తికేయ2 అలాంటి ఓ మంచి సినిమా అని మెచ్చుకున్నాడు. ఈ సందర్భంగా హీరో నిఖిల్ తో పాటు యూనిట్ సభ్యులందరికీ అభినందనలు తెలిపాడు.

ఇలా రెండు హిట్ సినిమాలపై తండ్రికొడుకులు ఇద్దరూ ఒకేసారి స్పందించడంతో వీళ్ల రియాక్షన్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి.

First Published:  28 Aug 2022 3:02 PM IST
Next Story